https://oktelugu.com/

Megastar154 Movie: మెగాస్టార్ మరో మూవీ అప్డేట్.. పోస్టర్ వైరల్

టాలీవుడ్ వెండితెర ఇలవేల్పు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమా అప్డేట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు వాటి అప్డేట్స్ ప్రకటించారు. తాజాగా చిరు పుట్టినరోజున మరో అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి హీరోగా మోహన్ రాజా, మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న చిత్రాల టైటిళ్లు ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి మీరోగా ప్రకటించిన సినిమా పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2021 / 04:42 PM IST
    Follow us on

    టాలీవుడ్ వెండితెర ఇలవేల్పు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమా అప్డేట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు వాటి అప్డేట్స్ ప్రకటించారు. తాజాగా చిరు పుట్టినరోజున మరో అప్డేట్ వచ్చేసింది.

    చిరంజీవి హీరోగా మోహన్ రాజా, మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న చిత్రాల టైటిళ్లు ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి మీరోగా ప్రకటించిన సినిమా పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    మలయాళీ చిత్రం లూసిఫర్ రిమేక్ గా మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక తమిళ చిత్రం ‘వేదాళం’ రిమేక్ కు మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’అనే పేర్లు ఖరారరయ్యాయి.

    ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంతో చిరంజీవి బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరంజీవి వరుస చిత్రాలు క్యూ కడుతున్నాయి.

    https://twitter.com/MythriOfficial/status/1429391721176059907?s=20