Ram Charan-Upasana Wedding Anniversary: చిరంజీవి లెగసీని కొడుకు రామ్ చరణ్ నిలబెట్టారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మరి చరణ్ తర్వాత ఆ సినీ వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఆయన కొడుకుపై ఉంటుంది. ఆ ఆశ, ఆసక్తి చిరంజీవి,చరణ్ కంటే వాళ్ళ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంటుంది. చరణ్ కూడా ఓ వారసుడిని కనాలని వారు కోరుకుంటున్నారు. వాళ్ళు అంతగా ఆవేదన చెందడం వెనుక ఓ కారణం కూడా ఉంది. చరణ్ కి వివాహం జరిగి పదేళ్లు అవుతుంది.
2012 జూన్ 14న చిరంజీవి-ఉపాసనల వివాహం ఘనంగా జరిగింది. ఈ ఏడాదితో వాళ్ళ వివాహ బంధం పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో ఉపాసన-చరణ్ వేడుకలకు సిద్ధమయ్యారు. ఇందు కోసం చరణ్ దంపతులు ఇటలీ దేశం పయనమయ్యారు. ఫ్యాషన్ నగరంగా పేరు గాంచిన మిలాన్ లో వీరి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజులు అక్కడ ఏకాంతంగా గడపనున్నారు. షూటింగ్స్ కి కూడా విరామం ప్రకటించి చరణ్ మిలాన్ ట్రిప్ ప్లాన్ చేశారు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవికి అంత కోపం వచ్చిందా.. ఏకంగా వాక్ అవుట్ చేశాడటగా!
అంతా బాగానే ఉన్నా చరణ్-ఉపాసన పిల్లల్ని కనకపోవడం మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఎంత కెరీర్ లో బిజీ అయినప్పటికీ పదేళ్లలో ఫ్యామిలీ ప్లానింగ్ చేయకపోవడం ఏంటి అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చక్కగా ఫ్యామిలీని నిర్మించుకున్నారు. చరణ్ కంటే ఓ ఏడాది ముందు 2011 లో అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ – స్నేహారెడ్డిలకు ఏడేళ్ల అబ్బాయి అయాన్, నాలుగేళ్ళ అమ్మాయి అర్హ ఉన్నారు. అదే విధంగా చరణ్ కూడా ఓ వారసుడి కంటే మురిసిపోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఉపాసనకు ఈ ప్రశ్న ఎదురైంది. సమాధానంగా ఉపాసన.. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మీడియా సెన్సేషన్ చేసేస్తోంది. పిల్లల్ని కనడం చిన్న విషయం కాదు. అది పెద్ద బాధ్యత. అన్నీ ఆలోచించుకోవాలి అంటూ ఏడో పొడిపొడిగా సమాధానం చెప్పింది. యంగ్ ఏజ్ లో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్స్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఉపాసనకు తెలియనిది కాదు. ప్రస్తుతం రామ్ చరణ్ ఏజ్ 37 కాగా, ఉపాసనకు 32. మరి ఇంకెప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారో చూడాలి.
Also Read:Ante Sundaraniki Collections: రెండో రోజు అంటే సుందరానికి కలెక్షన్స్ పరిస్థితి ఏంటీ?