Homeఎంటర్టైన్మెంట్Mega158 launch delay: మరోసారి వాయిదా పడిన Mega158 ప్రారంభోత్సవ కార్యక్రమం.. నిర్మాతకు కోట్లలో నష్టాలు..

Mega158 launch delay: మరోసారి వాయిదా పడిన Mega158 ప్రారంభోత్సవ కార్యక్రమం.. నిర్మాతకు కోట్లలో నష్టాలు..

Mega158 launch delay: ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత , చిరంజీవి(Megastar Chiranjeevi) , బాబీ(Bobby Kolli) కాంబినేషన్ లో రీసెంట్ గానే మరో సినిమా కుదిరిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తం లో ఈ సినిమాని చిరంజీవి ఒప్పుకున్నాడో తెలియదు కానీ , ఇప్పటి వరకు కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోలేదు ఈ చిత్రం. పలానా డేట్ లో ఈ సినిమా మొదలు అవ్వబోతుంది అని చెప్పడం , చివరికి వాయిదా పడడం , జనవరి నెల నుండి ఇదే రిపీట్ అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 11 న ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు మొదలు పెట్టాలని అనుకున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా రీసెంట్ గానే డైరెక్టర్, నిర్మాత ఆహ్వానించాడు. అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.

కారణం ఈ సినిమా ని నిర్మించే KVN ప్రొడక్షన్స్ సంస్థ సంక్షోభం లో చిక్కుకోవడమే. ఈ సంస్థ లోనే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరో గా నటించిన ‘జన నాయగన్’ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో జనవరి 9 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించడం తో అర్థఅంతరంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా నిర్మాత చిక్కుల పడ్డాడు. బయ్యర్స్ అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ కారణం చేతనే ఈ చిరంజీవి , బాబీ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఇక సినిమాని విడుదల చెయ్యడానికి అన్ని విధాలుగా ప్లానింగ్ చేసుకుంటున్న నిర్మాతకు , నిన్న సోషల్ మీడియా లో ఈ చిత్రం మొత్తం HD క్వాలిటీ తో లీక్ అవ్వడం పెద్ద చావు దెబ్బ అనే చెప్పాలి.

సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలే కనిపిస్తున్నాయి. పాపం నిర్మాత పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి కష్టసమయం లో ముహూర్తపు షాట్స్ పెట్టుకోవడం శుభకరం కాదని మెగాస్టార్ చిరంజీవే స్వయంగా వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది?, అసలు ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే , వేరే నిర్మాత చేతుల్లోకి ఈ చిత్రం వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి. డైరెక్టర్ బాబీ ఈసారి కమర్షియల్ కథతో కాకుండా , మంచి గ్యాంగ్ స్టర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ ని రెడీ చేశాడు . మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రం లో కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా , మలయాళం యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ చిరంజీవి కి కూతురు పాత్ర పోషించబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular