https://oktelugu.com/

MegaStar’s BHOLA SHANKAR : మెగాస్టార్ కెరీర్ లోనే ‘భోళా శంకర్’ డిఫరెంట్ !

టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భోళా శంకర్’ (Bhola Shankar) అనే టైటిల్ ను పెట్టారు. అయితే, మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిరు గుండు లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదే. అలాగే ఈ సినిమాలో […]

Written By:
  • admin
  • , Updated On : August 29, 2021 / 10:50 AM IST
    Follow us on

    టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భోళా శంకర్’ (Bhola Shankar) అనే టైటిల్ ను పెట్టారు. అయితే, మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిరు గుండు లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదే. అలాగే ఈ సినిమాలో మరో క్రేజీ లుక్ కూడా ఉందట.

    ఆ లుక్ పూర్తీ డిఫరెంట్ గా ఉంటుందట. మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. పైగా మెగాస్టార్ కి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చింది. ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ అద్భుతంగా వచ్చాయట. ఎలాగూ మెహర్ రమేష్ లో మంచి షార్ప్ డైరెక్టర్ ఉన్నాడు.

    హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి ఉన్న టాలెంట్ అతి తక్కువ మంది డైరెక్టర్లకి మాత్రమే ఉంది. కానీ, వరుస ప్లాప్ ల దెబ్బకు మెహర్ రమేష్ సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మరీ ఈ గ్యాప్ లో మెహర్ రమేష్ ఎలాంటి హార్డ్ వర్క్ చేసాడో.. తనను తానూ ఎలా అప్ డేట్ చేసుకున్నాడో చూడాలి.

    మెగాస్టార్ మాత్రం పెద్ద మనసుతో మెహర్ రమేష్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మరి మెహర్ రమేష్, మెగాస్టార్ కి పెద్ద క‌మ‌ర్శియ సక్సెస్ ఇచ్చి, తనకు ఉన్న ప్లాప్ డైరెక్టర్ ట్యాగ్ ను పోగొట్టుకుంటాడేమో చూద్దాం. అన్నట్టు గతంలో ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల‌తో మెహర్ రమేష్ భారీ చిత్రాలను చేశాడు.

    ఆ అనుభవం మెగాస్టార్ తో హిట్ కొట్టడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఒక డైరెక్టర్ గా మెహర్ రమేష్ లో గొప్ప టాలెంట్ ఉంది. షార్ప్ కటింగ్ షాట్ మేకింగ్ లో మెహర్ రమేష్ దిట్ట. ఇక ఈ సినిమా చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది.