Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య మృతి... ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరు

Megastar Chiranjeevi: ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య మృతి… ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరు

Megastar Chiranjeevi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ‍్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత రోశయ్య కన్నుమూశారు. ఈరోజు ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌ లోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్ధిక బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య రికార్డ్ సాధించారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య కొంత కాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Megastar Chiranjeevi
mega star chiranjeevi emotional post about politician rosayya death

Also Read: రోశయ్య రాజకీయంలో మీకు తెలియని గొప్పతనాలు ఇవీ

ఇప్పుడు తాజాగా కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా రోశయ్యను చిరంజీవి అభివర్ణించారు. రాజకీయ విలువలు, అత్యున్నత సాంప్రదాయాలు కాపాడడంలో ఒక యోగిలా సేవ చేశారన్నారు. ‘రోశయ్య మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆయన మనస్ఫూర‍్తిగా ఆహ్వానించారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య’ అని చిరంజీవి పేర్కొన్నారు. రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

Also Read: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version