https://oktelugu.com/

Amavaasya: నేడే శనీఅమావాస్య ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే!

Amavaasya: నేడు 2021 డిసెంబర్ 4 శనీఅమావాస్య మాత్రమే కాకుండా, ఈ ఏడాది వచ్చే చివరి సూర్యగ్రహణం. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం మన దేశంలో కనిపించదు.ఇకపోతే అమావాస్య శనివారం రావడం వల్ల ఈ అమావాస్యను శనీ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు ఎంతో మంచి రోజుగా చెప్పవచ్చు ముఖ్యంగా శని ప్రభావం ఉన్న వారు ఈ రోజు శని ప్రభావ దోషాన్ని పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే శని ప్రభావం దోషం వల్ల ఆర్థిక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 4, 2021 12:48 pm
    Follow us on

    Amavaasya: నేడు 2021 డిసెంబర్ 4 శనీఅమావాస్య మాత్రమే కాకుండా, ఈ ఏడాది వచ్చే చివరి సూర్యగ్రహణం. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం మన దేశంలో కనిపించదు.ఇకపోతే అమావాస్య శనివారం రావడం వల్ల ఈ అమావాస్యను శనీ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు ఎంతో మంచి రోజుగా చెప్పవచ్చు ముఖ్యంగా శని ప్రభావం ఉన్న వారు ఈ రోజు శని ప్రభావ దోషాన్ని పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే శని ప్రభావం దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు, చేపట్టిన పనులు తరచూ వాయిదా పడేవారు శనీ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల శని ప్రభావం తొలిగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

    Amavaasya

    Amavaasya

    ఎంతో ముఖ్యమైన శనీఅమావాస్య రోజు శనీశ్వరుడిని పూజించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే శనీశ్వరుడికి పూజ చేసిన అనంతరం స్వామి వారికి ఎంతో ఇష్టమైన మంచి నూనెను దానం చేయాలి. అయితే శని ప్రభావం దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మన మొహం చూసుకున్నా తర్వాత ఆ నూనెను దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది.

    Also Read: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి మధ్య ఉన్న అనుబంధం గురించి మీకు తెలుసా?

    అదేవిధంగా శనీశ్వరునికి ఇష్టమైన నూనెలను నువ్వులను దానం చేయాలి. ఇకపోతే శుక్రవారం రాత్రి ఒక నల్లని వస్త్రంలో నల్ల ఉప్పు మూట కట్టి దానిని దిండు కింద పెట్టుకొని నిద్ర పోవాలి. మరుసటి రోజు శనివారం ఉదయం ఆ ఉప్పు మూటని తీసుకెళ్లి శనీశ్వరుడి ఆలయంలో పెట్టడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది. అలాగే నల్లని యాంటీమొని కొని తల నుంచి పాదాల వరకు తొమ్మిది సార్లు దిగతీసి దానిని నేలలో పెట్టడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. ఇలా ఈ విధమైనటువంటి పరిహారాలు చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

    Also Read: మూర్ఖులతో వాదిస్తున్నారా.. అయితే మీ సమయం వృధా.. ఎందుకంటే?