Mega Star Chiranjeevi Achievements: కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే కుర్రాడు సినిమాల్లోకి వచ్చే ముందు చాలా కష్టాలు పడ్డాడు, భవిష్యత్తు గురించి చాలా భయపడ్డాడు. సినిమాల్లో నెట్టుకురాగలమా ? అవకాశాలు వస్తాయా ? అంటూ తొలినాళ్లలో చిరంజీవి ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేవారట. కానీ, చిరంజీవి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా ఎదిగారు. పైగా మళ్ళీ అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా కొనియాడారు.
ఈ క్రమంలో మెగాస్టార్ (Mega Star Chiranjeevi) సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న మొట్టమొదటి హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. పైగా ఒక్క తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా, యావత్ భారతీయ సినిమా పరిశ్రమలోనే మొదట కోటి రూపాయలు తీసుకున్న ఏకైక హీరో మెగాస్టారే.
ఇక సినిమాల్లో గుర్రపు స్వారీకి ఒక స్టైల్ ను తీసుకువచ్చిన హీరో కూడా చిరంజీవినే. అలాగే చిరంజీవికి డ్యాన్స్ లో కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. క్రేజీ స్టెప్స్ ను భారతీయ సినిమాలకు పరిచయం చేసిన వ్యక్తి కూడా మెగాస్టారే. ఇక కామెడీ పంచ్ లు విషయంలో, ఫైట్స్ విషయంలో చిరు రేంజ్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక అన్నిటికీ మించి ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రచయితలు కథలు రాయడం మొదలు పెట్టింది కూడా చిరంజీవి దగ్గర నుండే. ఏది ఏమైనా మెగా స్టార్ డమ్ వెనుక మెగాస్టార్ దశాబ్దాల కష్టం ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి నిత్య విద్యార్థినే. 150 సినిమాలు చేసినా.. ఇంకా వెండితెరపై తనదైన మ్యాజిక్ చూపించాలని తపన పడటం ఒక్క చిరంజీవికే సాధ్యం అయింది అనుకుంటా.
పైగా మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశంలో కూడా ఒక విశేషం ఉంది. ఆయన ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయినా.. ఆయన ఎన్నడూ మానసికంగా గెలుస్తూనే ఉన్నారు. భవిష్యత్తు తప్ప, గతం గురించి ఆలోచించని చిరంజీవి.. 200 ప్లస్ సినిమాలు చేసి మనల్ని అలరించాలని కోరుకుందాం.