ప్లాప్ దర్శకుడితో మెగా అల్లుడు.. ఇదేం స్ట్రాటజీ?

చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరీర్ కు పెద్దగా హెల్ప్ కాలేదని చెప్పొచ్చు. అయితే మెగా ఫ్యామిలీ సపోర్టు ఉండటంతో మెగా అల్లుడికి పలు సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. కల్యాణ్ దేవ్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఈక్రమంలో కల్యాణ్ దేవ్ రెండో సినిమాగా […]

Written By: NARESH, Updated On : October 31, 2020 11:25 am
Follow us on

చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరీర్ కు పెద్దగా హెల్ప్ కాలేదని చెప్పొచ్చు. అయితే మెగా ఫ్యామిలీ సపోర్టు ఉండటంతో మెగా అల్లుడికి పలు సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. కల్యాణ్ దేవ్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈక్రమంలో కల్యాణ్ దేవ్ రెండో సినిమాగా ‘సూపర్ మచ్చీ’ రాబోతుంది. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం చివరిదశలో ఉందని సమాచారం. టైటిల్ చూస్తుంటేనే సినిమా హిట్టవుతుందనే టాక్ విన్పిస్తోంది. దీంతో మూవీపై కల్యాణ్ దేవ్ తోపాటు మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో హిట్టు బాటపట్టాలని కల్యాణ్ దేవ్ ఆశిస్తున్నాడు.

Also Read: కాజల్ కు పెళ్లి అయింది కానీ హనీమూన్ లేదట?

‘సూపర్ మచ్చీ’ చేస్తూనే కల్యాణ్ దేవ్ మరో రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా ‘అశ్వద్ధామ’ దర్శకుడు రమణ్ తేజ్ తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఇవాళే జరిగినట్లు సమాచారం. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్న కల్యాణ్ దేవ్ ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన స్ట్రాటజీ ఏంటనే చర్చ జరుగుతోంది.

Also Read: పవన్ ను ఢీకొట్టబోయేవాడు ఇంకా దొరకలేదా ?

రమణ తేజ్ దర్శకత్వంలో వచ్చిన ‘అశ్వద్ధామ’ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కల్యాణ్ దేవ్ కు రమణ తేజ్ చెప్పిన బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన సమయంలో కల్యాణ్ దేవ్ ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంపై అభిమానులు షాకవుతున్నారు. కల్యాణ్ దేవ్ నమ్మకాన్ని రమణ తేజ్ ఏమేరకు నెరవేరుస్తాడో వేచిచూడాల్సిందే..!