https://oktelugu.com/

ఇన్ సైడ్ టాక్: ‘ఉప్పెన’లో పాటపై గోలగోల..!

మెగా ఫ్యామిలీ సపోర్టుతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ గతంలోనే పూర్తయినా థియేటర్లు మూతపడటంతో విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ కావడంతో ఈ సినిమాను థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 10:18 AM IST
    Follow us on

    మెగా ఫ్యామిలీ సపోర్టుతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ గతంలోనే పూర్తయినా థియేటర్లు మూతపడటంతో విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ కావడంతో ఈ సినిమాను థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘ఉప్పెన’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్.. ట్రైలర్.. సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దీంతో ఈ మూవీ హిటవుందనే నమ్మకం నిర్మాతల్లో ఉండటంతో ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పాటల విషయంలో వెర్షన్ గోల మొదలవడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: పవన్ ను ఢీకొట్టబోయేవాడు ఇంకా దొరకలేదా ?

    ఒకప్పుడు ఒకే పాటకు మూడునాలుగు వెర్షన్లు రాయించుకునేవారు. అంటే ఒకే ట్యూన్ ఇద్దరు ముగ్గురు రచయితలకు విన్పించి పాట రాయించుకోనేవారు. ఇప్పుడందరూ బీజీగా కావడంతో ఒకరినే నమ్ముకొని వారితోనే పాటలు రాయించుకోవడం చేస్తున్నారు. అయితే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఓ ట్యూన్ ను నలుగురు గీత రయితలకు ఇచ్చాడట. వారంతా ఆ ట్యూన్ కి అద్భుతమైన పాటలను రాశారట.

    నలుగురు గీత రచయిత రాసిన పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన పాట దర్శకుడు బుచ్చిబాబుకు నచ్చిందట. సుకుమార్ సైతం కూడా ఒకే చేశాడని టాక్. అయితే ఈ పాట సంగీత దర్శకుడైన దేవిశ్రీ నచ్చలేదట. రామజోగయ్య ఇచ్చిన పాట తీసుకోవడం ఇష్టంలేక దేవిశ్రీ అలా చెప్పాడనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ పాట విషయంలో నిర్ణయాన్ని సుకుమార్ దర్శకుడు బుచ్చిబాబుకే అప్పగించాడని సమాచారం.

    Also Read: ఎంగేజ్ మెంట్ అంటూ పునర్నవి ఇంత చీట్ చేసిందా?

    ఇక నలుగురు గీత రచయితలతో పాట రాయించిన ఎవరి పాట ఫైనల్ అయిందనే మాత్రం గీత రచయితలకు కూడా తెలియదని సమాచారం. త్వరలోనే ఈ పాట విడుదల కానుండటంతో ఎవరీ పాట ఫైనల్ అయిందనేది అప్పుడే తెలియనుంది. దీంతో నలుగురు గీత రచయితలతోపాటు అభిమానులు సైతం ఈ పాట కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.