Ram Charan: కరోనా కష్ట సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తానే ముందడుగు వేశారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమ కోసం ” సిసిసి ” ద్వారా తోటి నటీనటుల సహాయంతో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. సినీ కార్మికులకు నిత్యవసరాలు, బియ్యం వగైరా సరుకులను పంపిణీ చేయడం తెలిసిన విషయమే. అలాగే టాలీవుడ్ నిర్మాతలని ఇంటికి పిలిపించి… తన తోటి హీరో నాగార్జునని కూడా కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పరిశ్రమలో ఉన్న కష్టాల గురించి కూడా విన్నవించారు. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు.

25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందన్నారు రామ్ చరణ్. దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విస్తరణ చేసేందుకు కృషి చేస్తా అన్నారు. దాతలు ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని రక్తదానం చేయొచ్చని చెప్పారు. నాన్న నట వారసత్వాన్నే కాదు, సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నానని చరణ్ తెలిపారు. చిన్న, చిన్న అడుగులతో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ప్రకటించారు.
అదే విధంగా మరో 30 ఏళ్లపాటు తన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయన్నారు. తమ సినిమా పారితోషకాలతో ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కొనసాగు తుందని.. 10 మందికి సహాయం అందుతుదంటే దాతల నుంచి విరాళాలు తీసుకుంటామన్నారు. రెండో దశలో బ్లడ్ బ్యాంకు కోసం ప్రత్యేక యాప్ తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెర్రీ వెల్లడించారు.