https://oktelugu.com/

Bheemla Nayak: “భీమ్లా నాయక్” మూవీ లోని ఫోర్త్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే…

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ ఐ‌టి గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషీయం” సినిమాకు రీమేక్ గా ఈ మూవీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 07:21 PM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ ఐ‌టి గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషీయం” సినిమాకు రీమేక్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు  చేపట్టడం విశేషం. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.

    ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నాలుగవ సింగిల్ ను రిలీజ్ డేట్ ను ఇది వరకే ప్రకటించారు. కాగా ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అకాల మృతి కారణంగా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు ఈ పాటను డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10:08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “అడవి తల్లి మాట” అంటూ సాగే ఈ గీతాన్ని విడుదల చేయనుంది మూవీ యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ అప్ డేట్ తో పవన్, రానా అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

    https://twitter.com/SitharaEnts/status/1466717587782311936?s=20