https://oktelugu.com/

మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా?

టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో ఆయన సినిమాలు చేస్తూ పోతుంటాడు. యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల మూవీలను పట్టాలెక్కించడం దిల్ రాజు ప్రత్యేకత. టాలీవుడ్లోని స్టార్ హీరోలందరికీ దిల్ రాజు సినిమాలు చేశారు. అయితే సీనియర్ హీరోలైన బాలకృష్ణ.. చిరంజీవితో మాత్రం ఆయన సినిమాలు చేయలేదు. Also Read: నానికి ఇంకో హీరోయిన్ కావలెను కొంతకాలంగా దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవితో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 11:59 AM IST
    Follow us on

    టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో ఆయన సినిమాలు చేస్తూ పోతుంటాడు. యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల మూవీలను పట్టాలెక్కించడం దిల్ రాజు ప్రత్యేకత. టాలీవుడ్లోని స్టార్ హీరోలందరికీ దిల్ రాజు సినిమాలు చేశారు. అయితే సీనియర్ హీరోలైన బాలకృష్ణ.. చిరంజీవితో మాత్రం ఆయన సినిమాలు చేయలేదు.

    Also Read: నానికి ఇంకో హీరోయిన్ కావలెను

    కొంతకాలంగా దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎట్టకేలకు వారిద్దరి కాంబినేషన్ సెట్టయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానరైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో చిరంజీవి సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే టాక్ విన్పిస్తోంది.

    చిరంజీవికి సరిపడా కథ కోసం దిల్ రాజు అన్వేషిస్తున్నారట. కథల విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ సరిగ్గా ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక చిరంజీవి సైతం కథల విషయంలో ఆచితూచి ముందడుగు వేస్తుంటారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

    చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కోరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ నటిస్తారని తెలుస్తోంది.

    Also Read: ‘గోన గన్నారెడ్డి’గా బాలయ్య.. ఫ్యాన్స్ కు పండుగే..!

    ఆ తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ తో ‘లూసీఫర్’ రీమేక్ లోనూ నటించనున్నాడు. అదేవిధంగా బాబీతో సురేష్ ప్రొడక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాకే దిల్ రాజు సినిమా ఉంటుందని టాక్. దిల్ రాజు బ్యానర్లో బోయపాటి శ్రీను ఓ సినిమా చేయనున్నాడు.

    దీంతో మెగాస్టార్ చిరంజీవి-బోయపాటి కాంబినేషన్ ను సెట్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ కాంబినేషన్ సెట్ అవడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో మెగా అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు.