https://oktelugu.com/

నానికి ఇంకో హీరోయిన్ కావలెను

నేచ్యురల్ స్టార్ నాని తన కథల పరిధిని పెంచారు. ఇన్నాళ్లు చిన్న స్పాన్ ఉన్న సినిమాలను, సాదాసీదా నేపథ్యమున్న కథలను చేసుకుంటూ వెళ్లిన ఆయన ఈమధ్య కొంచెం పెద్దగా ఆలోచిస్తున్నారు. చేయబోయే కథలకు పెద్ద స్పాన్ ఉండాలని ఆశపడుతున్నారు. అలా ఆలోచించే ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కలకత్తా నేపథ్యంలో జరిగే కథ. Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ: ఎన్టీఆర్ టోపీ తీస్తారా? రాజమౌళి కాంప్రమైజ్ అవుతారా? ‘టాక్సీవాలా’ చిత్రంతో దర్శకుడిగా […]

Written By:
  • admin
  • , Updated On : October 28, 2020 / 11:56 AM IST
    Follow us on


    నేచ్యురల్ స్టార్ నాని తన కథల పరిధిని పెంచారు. ఇన్నాళ్లు చిన్న స్పాన్ ఉన్న సినిమాలను, సాదాసీదా నేపథ్యమున్న కథలను చేసుకుంటూ వెళ్లిన ఆయన ఈమధ్య కొంచెం పెద్దగా ఆలోచిస్తున్నారు. చేయబోయే కథలకు పెద్ద స్పాన్ ఉండాలని ఆశపడుతున్నారు. అలా ఆలోచించే ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కలకత్తా నేపథ్యంలో జరిగే కథ.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ: ఎన్టీఆర్ టోపీ తీస్తారా? రాజమౌళి కాంప్రమైజ్ అవుతారా?

    ‘టాక్సీవాలా’ చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో నాని మెచ్యూర్ రోల్ చేయబోతున్నారు. కథ పెద్దది కావడం వలన సబ్ ప్లాట్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే కథానాయికలు కూడ ఎక్కువమంది ఉన్నారు ఇందులో. మొదట ఇద్దరు హీరోయిన్ల పేర్లను అనౌన్స్ చేశారు.

    Also Read: ఆ సినిమా నుంచి మురగదాస్ తప్పుకున్నాడా? తప్పించారా..!

    వారే సాయి పల్లవి, కృతి శెట్టి. వీరిద్దరూ కాకుండా ఇంకొక హీరోయిన్ కావాలట ఈ సినిమా కోసం. అంటే మొత్తం ముగ్గురన్న మాట. ఈ పాత్ర కోసం నివేత పేతురాజ్, అదితిరావ్ హైదరి, నివేతా థామస్ లాంటి హీరోయిన్ల పేర్లు వినబడుతున్నాయి. వీరి నుండే ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే నాని ప్రజెంట్ చేస్తున్న ‘టక్ జగదీష్’ చిత్రం పూర్తయ్యాక ఈ సినిమా ఆరంభం కానుంది.

    Tags