Mega Heroes
Mega Heroes: గత ఏడాది వరకు మెగా హీరోల జాతకాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. పట్టిందల్లా బంగారం అయ్యింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా చరిత్ర సృష్టించడం, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి పద్మవిభూషణ్ తో పాటు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కడం, రామ్ చరణ్(Ram Charan) కి డాక్టరేట్ రావడం, ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే ఒకరోజు సమయం పడుతుంది. ఆ రేంజ్ లో మెగా హీరోలు దున్నేశారు. కానీ ఈ ఏడాది మెగా హీరోలకు ఆరంభం నుండే అంతగా కలిసి రావడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గేమ్ చేంజర్'(Game changer) చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఆ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి వెళ్లడం హైలైట్ గా నిల్చింది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్లడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని, ఐరన్ లెగ్ అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా లో ప్రచారం చేసారు.
ఇక నేడు విడుదలైన ‘లైలా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొంతమంది రివ్యూయర్స్ నేడు జీరో రేటింగ్స్ ఇవ్వడం గమనార్హం. కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లను కూడా ఈ సినిమా సొంతం చేసుకోలేకపోయింది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి హ్యాండ్ అని ఆయన దురాభిమానుల ప్రచారం చేస్తున్నారు. ‘లైలా’ తో పాటు నేడు ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం కూడా విడుదలైంది. చాలా సైలెంట్ గా విడుదల కావాల్సిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ లో చేసిన కొన్ని కామెంట్స్ నేషనల్ లెవెల్ లో వివాదాస్పదంగా మారాయి. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో నెగటివ్ అభిప్రాయం ఏర్పడింది. అందుకు కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి నే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుతుందని అర్థం అవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ దగ్గర నుండి మెగా హీరోలకు బ్యాడ్ టైం మొదలైందని, సినిమాల పరంగా కొంతకాలం ఓడిడుగులు ఎదురుకోక తప్పేలా లేదని అనుకుంటున్నారు. కానీ రాజకీయంగా మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహర్దశలో ఉన్నాడు. కేవలం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా , సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి టైం నడుస్తుందని, ఈ సమయంలో ఆయన ఒక్క సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోతాదని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి ఆయన కారణంగానే మెగా ఫ్యామిలీ మళ్ళీ ఫేమ్ లోకి రావాలేమో, అప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు ఐరన్ లెగ్ ముద్ర ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో మెగా హీరోల జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉండబోతుంది అనేది.