నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయింది. కేవలం క్రిష్ ఈ సినిమాను 40 రోజుల్లోనే ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ ఇచ్చాడు. కానీ కరోనాతో పాటు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. అయితే, తాజాగా క్రిష్ ఈ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేశాడు.
ఈ నెల 20వ తేదీన ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తామని క్రిష్ నుండి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. 20వ తేదీన ఉదయం 10:15 నిమిషాలకు క్రిష్ – వైష్ణవ్ తేజ్ మూవీ పోస్టర్ రాబోతుంది. అన్నట్టు ఈ సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగనుంది.
పైగా కథ చాలా సహజంగా ఉంటుంది. అలాగే కథలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయట. ఇక పక్కా ఎమోషన్ తో నడిచే సినిమా కావడంతో ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాని మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా ప్రివ్యూ వేసారు. సినిమా అవుట్ ఫుట్ పట్ల ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని ఆ మధ్య మేము రివీల్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఉప్పెనతో వచ్చిన క్రేజ్ ను, వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో స్టార్ డమ్ గా మార్చుకుంటాడో చూడాలి.