Afghanistan Crisis: తాలిబన్లను ఓడించిన అప్ఘన్ సైన్యం.. ఒక నగరం స్వాధీనం

అధ్యక్షుడు పక్క దేశం పారిపోయినా.. అప్ఘన్ సైన్యం తుపాకులు వదిలేసి లొంగిపోయిన ఆ దేశ ఉపాధ్యక్షుడు మాత్రం పోరాటం జరుపుతున్నాడు. ఆయనే ‘అమ్రుల్లా సలేహ్’. అధికారాన్ని కోల్పోయిన అప్ఘనిస్తాన్ కు వైఎస్ ప్రెసిడెంట్ అయిన అరుల్లా సలేహ్.. ఇప్పుడు ఆయన ఉంటున్న నగరాన్ని తన ప్రభుత్వ సైన్యంతో కలిసి చేజిక్కించుకున్నాడు. కాబూల్ కు ఉత్తరాన ఉన్న పర్వాన్ ప్రావిన్స్ లోని చారికర్ అనే ప్రాంతాన్ని తాలిబాన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. వ్యూహాత్మకంగా క్రికర్ నుంచి ముఖ్యమైన రహదారి […]

Written By: NARESH, Updated On : August 18, 2021 12:48 pm
Follow us on

అధ్యక్షుడు పక్క దేశం పారిపోయినా.. అప్ఘన్ సైన్యం తుపాకులు వదిలేసి లొంగిపోయిన ఆ దేశ ఉపాధ్యక్షుడు మాత్రం పోరాటం జరుపుతున్నాడు. ఆయనే ‘అమ్రుల్లా సలేహ్’. అధికారాన్ని కోల్పోయిన అప్ఘనిస్తాన్ కు వైఎస్ ప్రెసిడెంట్ అయిన అరుల్లా సలేహ్.. ఇప్పుడు ఆయన ఉంటున్న నగరాన్ని తన ప్రభుత్వ సైన్యంతో కలిసి చేజిక్కించుకున్నాడు.

కాబూల్ కు ఉత్తరాన ఉన్న పర్వాన్ ప్రావిన్స్ లోని చారికర్ అనే ప్రాంతాన్ని తాలిబాన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. వ్యూహాత్మకంగా క్రికర్ నుంచి ముఖ్యమైన రహదారి సొంరంగం గుండా ఈ దాడులు చేస్తున్నారు.

ఉత్తర అప్ఘనిస్తాన్ లోని రాజధాని కాబూల్ అతిపెద్ద నగరం. అప్ఘనిస్తాన్ లోని చిన్న పట్టణం చారికర్. పార్వన్ ప్రావిన్స్ లో ఉన్న ఈ చిన్నపట్టణంలోనే వైఎస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ ఉంటున్నాడు. అప్ఘన్ లు విచ్చలవిడిగా భయంతో పారిపోతుంటే.. ఒక్క వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా మాత్రం తిరుగుబాటుకు రెడీ అయ్యారు. తాను ఉంటున్న చారికర్ సిటీని తాలిబన్ల నుంచి తరిమేసి తన ఆధీనంలోకి తెచ్చుకొని సంచలనం సృష్టించాడు. చారికర్ చిన్నపట్టణం అయినా ఇప్పుడక్క అధికారిక తిరుగుబాటు అక్కడి నుంచే మొదలు కావడంతో ప్రజల్లో కొత్త విశ్వాసం వచ్చింది. ప్రభుత్వ సైన్యం ఏకంగా తాలిబన్లను ఓడించి తరిమికొట్టింది. చారికర్ కేంద్రంగా వైఎస్ ప్రెసిడెంట్ సలేహ్ ఇప్పుడు పాలన మొదలుపెట్టారు.

ఇదిచూసి చాలా మంది అప్ఘనిస్తాన్ ప్రజల్లో విశ్వాసం నెలకొంది. అంతర్యుద్ధం వస్తుందా? లేదా?.. సలేహ్ మిగతా ప్రాంతాలపై దండెత్తుతాడా? అక్కడికే పరిమితం అవుతాడా? అన్నది చూడాి.