https://oktelugu.com/

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న మెగా హీరో !

మెగా కుటుంబం నుండి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్న వైష్ణ‌వ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ సినిమా విడుదలకి క‌రోనా వైర‌స్ బ్రేకులేసింది. ఈ మూవీ నుండి ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ విడుదలవగా సూపర్ సక్సెస్ తో సినిమా మీద అంచనాలని భారీగా పెంచింది. ఇక మూవీ విడుదలకి సిద్దమవుతున్న తరుణంలో కరోనా ఎంట్రీ ఇచ్చి వైష్ణవ్ ఆశల మీద నీళ్లు చల్లింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రత్యేక నిబంధనలతో థియేటర్లని ఓపెన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 04:47 PM IST
    Follow us on


    మెగా కుటుంబం నుండి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్న వైష్ణ‌వ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ సినిమా విడుదలకి క‌రోనా వైర‌స్ బ్రేకులేసింది. ఈ మూవీ నుండి ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ విడుదలవగా సూపర్ సక్సెస్ తో సినిమా మీద అంచనాలని భారీగా పెంచింది. ఇక మూవీ విడుదలకి సిద్దమవుతున్న తరుణంలో కరోనా ఎంట్రీ ఇచ్చి వైష్ణవ్ ఆశల మీద నీళ్లు చల్లింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రత్యేక నిబంధనలతో థియేటర్లని ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఉప్పెన సినిమా మీద ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు థియేట‌ర్లు పూర్తిగా ఓపెన్ అయ్యాక విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట.

    Also Read: విభిన్న తరహా కథతో సత్యదేవ్ ‘గాడ్సే’

    కరోనా ఇచ్చిన ఈ భారీ గ్యాప్ ని నింపడానికి తెలుగు హీరోలంతా ఒకటికి రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ కోవలోనే ఈ మెగా హీరో కూడా తన సెకండ్ మూవీని ఏకంగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేసాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందట. ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో మూవీ రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉండ‌గా… ఇప్పుడు మ‌రో రెండు సినిమాల‌ను లైన్లో పెట్టేశాడు. అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వైష్ణ‌వ్ కు ఈ రేంజ్ లో ఆఫ‌ర్స్ రావటం అందరికి ఆశ్చర్యంగా ఉంది.

    Also Read: క్రేజీ బ్యూటీకి బ్యాడ్ టైమ్.. ఎవ్వరూ పట్టించుకోవట్లేదట !

    తాజాగా ఓ కొత్త ద‌ర్శ‌కుడితో, అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో రూపొందుతున్న చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా నటించనున్నాడట. ఇక నాలుగో సినిమా షైన్ స్క్రీన్ ప‌తాకంపై చేసేందుకు వైష్ణ‌వ్ తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల‌ను ఈ ఇయ‌ర్ లోనే పూర్తి చేయ‌నున్నారట. వైష్ణవ తేజ్ తరువాత సినిమాల కోసం ఇప్ప‌టి నుండే మేనమామ చిరంజీవి స్వయంగా క‌థ‌లు వింటున్న‌ట్లు తెలుస్తోంది. అందరు హీరోలు ఇలా ఇన్నిన్ని సినిమాలు చేస్తుంటే ఈ సినిమాలన్నీ అసలు ఎప్పుడు విడుదల అవుతాయోనని తెలుగు ప్రేక్షకులు ఒకింత అయోమయంలో ఉన్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్