https://oktelugu.com/

విభిన్న తరహా కథతో సత్యదేవ్ ‘గాడ్సే’

హీరో సత్యదేవ్ ,గణేష్ పట్టాబి దర్శకత్వం వహించిన ‘బ్లఫ్ మాస్టర్’ ‌మూవీలో తన నటనా విశ్వరూపం చూయించాడు. ఈ కాంబినేషన్లో మరో క్రేజీ మూవీ రాబోతుంది. నటుడు సత్యదేవ్ , షార్ట్ ఫిల్మ్‌ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఆపై మిస్టర్ పర్ఫెక్ట్‌లో ప్రభాస్ ఫ్రెండ్ గా క్యారెక్టర్ రోల్‌లో నటించటం ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈయన ఎక్కువగా కథా బలం ఉన్న చిత్రాలలో నటించటానికి ఇష్టపడతాడు. C /O ‘ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహాతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 04:29 PM IST
    Follow us on


    హీరో సత్యదేవ్ ,గణేష్ పట్టాబి దర్శకత్వం వహించిన ‘బ్లఫ్ మాస్టర్’ ‌మూవీలో తన నటనా విశ్వరూపం చూయించాడు. ఈ కాంబినేషన్లో మరో క్రేజీ మూవీ రాబోతుంది. నటుడు సత్యదేవ్ , షార్ట్ ఫిల్మ్‌ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఆపై మిస్టర్ పర్ఫెక్ట్‌లో ప్రభాస్ ఫ్రెండ్ గా క్యారెక్టర్ రోల్‌లో నటించటం ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈయన ఎక్కువగా కథా బలం ఉన్న చిత్రాలలో నటించటానికి ఇష్టపడతాడు. C /O ‘ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో ఉమా మహేశ్వర రావు పాత్రలో సత్యదేవ్‌ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు.

    Also Read: ‘బుట్టబొమ్మ’ క్రేజ్‌ క్రెడిట్‌ అంతా ఆయనదేనంట..!

    ఎలాంటి పాత్రకైనా కూడా సరైన న్యాయం చేయగలడని సత్యదేవ్ తన నటన ద్వారా నిరూపించుకున్నాడు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ ని అనుకుంటున్నారట. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలతో చాలా బిజీగా ఉన్న సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సి. క‌ల్యాణ్ నిర్మాతగా స‌త్య‌దేవ్‌, గోపిగ‌ణేష్ ప‌ట్టాభి కాంబినేష‌న్‌లో ‘గాడ్సే’ మూవీని అనౌన్స్ చేసారు.

    Also Read: క్రాక్‌ సినిమా టీం ఆలోచన సక్సెస్‌ తెచ్చిపెట్టేనా

    బ్లఫ్ మాస్టర్ లాంటి క్లాసిక్ మూవీ తర్వాత ఆ కలయికలో వస్తున్న ఈ మూవీ మీద అంచనాలు బాగానే ఉంటాయి. అయితే ఈసారి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోనర్ లో ‘గాడ్సే’ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఈ మూవీలో స‌త్య‌దేవ్ చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం విడుద‌ల చేసిన టైటిల్ పోస్ట‌ర్ ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని కొత్త క్యారెక్ట‌ర్‌లో ‘గాడ్సే’గా స‌త్య‌దేవ్ మ‌న‌ ముందుకు రాబోతున్నారట. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాల గురించి త్వరలో వెల్లడిస్తారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్