Mega Fans : పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) అయిన సందర్భం తప్ప, మెగా అభిమానులకు ఈమధ్య కాలంలో సంతృప్తి పరిచే ఒక్క సంఘటన కూడా జఱగలేదు. చిరంజీవి(Megastar Chiranjeevi) ‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ ని అందించి అభిమానులు బాగా నిరాశపరిచాడు. ఆ తర్వాత ఆయన విశ్వంభర మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదట్లో అందరూ నమ్మేవాళ్ళు కానీ, ఎప్పుడైతే టీజర్ విడుదలైందో, అప్పటి నుండి ఆ నమ్మకాలు మొత్తం ఆవిరి అయిపోయాయి. ఎప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘భీమ్లా నాయక్’ చిత్రం తర్వాత ఆయన నుండి సినిమానే లేదు, మూడేళ్లు అవుతుంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. ఇక రామ్ చరణ్(Global Star Ram Charan) అయితే ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ తో ఫ్యాన్స్ ని తీవ్ర స్థాయిలో నిరాశపరిచాడు.
Also Read : గ్రౌండ్ జీరో మూవీ టాక్, ఇమ్రాన్ హష్మీ వార్ డ్రామా ఎలా ఉందంటే?
రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో ని చూసి ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు కానీ, వాళ్లకు ఇంకా ఎదో భారీ హై మూమెంట్ కావాలి. అలాంటి మూమెంట్ మే9 న దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, కానీ జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ ఎంతో ప్రత్యేకం. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు ఉన్న సమయంలో ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆడియన్స్ ఆ వరదలను లెక్క చేయకుండా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఆల్ టైం ఇండస్ట్రీ గా నిల్చింది. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్. మే9 న కేవలం 2D లో మాత్రమే కాదు 3D లోకి కూడా తీసుకొస్తున్నాడు.
మన టాలీవుడ్ చరిత్రలో తొలిసారి ఒక రీ రిలీజ్ చిత్రం 3D లో విడుదల అవ్వడం ఈ చిత్రానికి మాత్రమే జరుగుతుంది. 3D వెర్షన్ అద్భుతంగా వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రీ రిలీజ్ ఒక సెన్సేషన్ ని నెలకొల్పుతుంది అనుకోవచ్చు. అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన వ్యాక్స్ విగ్రహం ‘మేడమ్ తుస్సాడ్స్’ లో గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. ఈ ఈవెంట్ కి కూడా రామ్ చరణ్ వెళ్లనున్నారు. అనంతరం అయాన్ ఆల్బర్ట్ హాల్ లో #RRR మూవీ లైవ్ పెర్ఫార్మన్స్ ని వీక్షించనున్నాడు. ఇలా ఒకే రోజున జీవితాంతం మర్చిపోలేని విధమైన సంఘటనలు జరగడం మెగా అభిమానులకు నిజంగా పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. ఇక్కడ నుండి అయినా మెగా ఫ్యాన్స్ కి శుభ దినాలు మొదలు అవుతాయో లేదో చూడాలి.
Also Read : ప్రభాస్ చేసిన సినిమాల్లో పూరి జగన్నాధ్ కి బాగా నచ్చిన సినిమా అదేనా..?