Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న గుర్తింపు ఇంకా వేరే ఏ హీరోకి లేదనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ని మించిన స్టార్ హీరో మరొకరు లేదనేది తేలిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటితో క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ప్లాప్ సినిమాలకి కూడా మిగతా హీరోల సినిమాలకు వచ్చినంత కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అంటే పాన్ ఇండియాలో ఆయనకి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు పోటీ పడుతున్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాథ్ కి సైతం ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని ఒకానొక ఇంటర్వ్యూ లో పూరి జగన్నాథ్ చెప్పాడు. ప్రభాస్ నటించిన సినిమాల్లో పూరి జగన్నాథ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటి అనే కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
ఇక పూరి జగన్నాథ్ ప్రభాస్ చేసిన సినిమాల్లో బుజ్జిగాడు సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పినప్పటికి ఆయన చేసిన సినిమాలు కాకుండా వేరే సినిమాల్లో ఎక్కువగా నచ్చిన సినిమా ఏంటి అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా పూరి జగన్నాథ్ డార్లింగ్ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం విశేషం.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరోసారి మరొక సినిమా వస్తే చూడాలని యావత్ ఇండియన్ ప్రేక్షకులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు. తద్వారా వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలాంటి సంచాలనాలను క్రియేట్ చేస్తుంది. అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పరిస్థితిలో పూరి జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం భారీగా డౌట్ ఫాల్ అయ్యారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది అసాధ్యమనే చెప్పాలి.
Also Read : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…