Homeఎంటర్టైన్మెంట్Ground Zero: గ్రౌండ్ జీరో మూవీ టాక్, ఇమ్రాన్ హష్మీ వార్ డ్రామా ఎలా ఉందంటే?

Ground Zero: గ్రౌండ్ జీరో మూవీ టాక్, ఇమ్రాన్ హష్మీ వార్ డ్రామా ఎలా ఉందంటే?

Ground Zero: పహల్గావ్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు మారణకాండకు తెగబడిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందం పక్కన పెట్టిన ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య గ్రౌండ్ జీరో టైటిల్ తో వార్ డ్రామా విడుదలైంది. గ్రౌండ్ జీరో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం.

Also Read: నటుడు సునీల్ పొలిటికల్ ఎంట్రీ! మేటర్ తెలిస్తే మైండ్ బ్లాక్

బీఎస్ఎఫ్ అధికారి నరేంద్రనాథ్ ధర్ దూబే నేతృత్వంలో ఉగ్రవాది రాణా తాహిర్ నదీమ్ అలియాస్ ఘాజీ బాబాను హతమార్చారు. ఈ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు తేజస్ ప్రభ దియోస్కర్ తెరకేకించింది. గ్రౌండ్ జీరో మూవీ కథ విషయానికి వస్తే.. కాశ్మీర్ లోయలో బీఎస్ఎఫ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరేంద్రనాథ్ ధర్ దూబే(ఇమ్రాన్ హష్మీ) స్థానిక కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్ హుస్సేన్ (మీర్ మెహ్రూజ్)సహాయంతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఘాజీ బాబా ఆచూకీ కనుగొంటాడు. అతన్ని పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలిసి ఆపరేషన్ చేపడతాడు.

కానీ ఆ ఆఫరేషన్ ఫెయిల్ అవుతుంది. మరి ఘాజీ బాబాను నరేంద్రనాథ్ పెట్టుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అనేది కథ. గ్రౌండ్ జీరో చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. నరేంద్రనాథ్ ధర్ దూబే పాత్రలో ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడని అంటున్నారు. జయ దూబే పాత్ర చేసిన సాయి తమంహంకర్ షో బాగా చేసిందని పబ్లిక్ టాక్. కాలేజ్ స్టూడెంట్ రోల్ చేసిన మెహ్రూజ్ నటనకు కూడా మార్కులు పడుతున్నాయి. క్లైమాక్స్ కట్టిపడేస్తుంది. కమల్జీత్ నేగి సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాశ్మీర్ అందాలు గొప్పగా తన కెమెరాలో బంధించారు.

గ్రౌండ్ జీరో మూవీలో డైలాగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సంభాషణలు ఆలోచన రేకెత్తించేలా ఉంటాయని సినిమా పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అలాగే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీని తలపించాయి అంటున్నారు. దేశభక్తిని రగిలించే రియల్ హీరో జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గ్రౌండ్ జీరో మూవీ ఒకసారి చూడాలి.

 

RELATED ARTICLES

Most Popular