Mega Family watches OG together: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం రీసెంట్ గానే విడుదలై సూపర్ హిట్ స్టేటస్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం మొదటి వీకెండ్ లోనే 80 శాతం కి పైగా రికవరీ ని సాధించి సెన్సేషన్ సృష్టించిన ఓజీ చిత్రం, ఈ వీకెండ్ తో పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోనుంది. మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్ ని సొంతం చేసుకొని టాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం, వీకెండ్ గడిచిన తర్వాత కూడా డీసెంట్ స్థాయి హోల్డ్ ని సొంతం చేసుకొని ముందుకు వెళ్తుంది. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రీ ఫెస్టివల్ సీజన్ లో ఈ రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టడం చిన్న విషయం కాదు.
ఇకపోతే ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో చూసారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. మెగా ఫ్యాన్స్ ఈ విజువల్స్ ని చూసి సంబరపడుతున్నారు. అంతే కాదు, ఓజీ సీక్వెల్ కూడా ఉంటుందని, త్వరలోనే డేట్స్ కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ఈ సమక్షం లో చెప్పాడట. ఈ విషయం బయటకు లీకై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకపక్క మొన్న అసెంబ్లీ లో బాలయ్య చేసిన కామెంట్స్ చిరంజీవిని బాగా బాధపెట్టాయి. దీనిపై ఆయన కౌంటర్ కూడా ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ వైపు నుండి ఎలాంటి కౌంటర్ రాకపోవడం తో చిరంజీవి ఈ విషయం లో బాధ పడుంటాడు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన నిన్న తన కుటుంబం మొత్తంతో కలిసి నిన్న ఓజీ చిత్రం చూడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే ఓజీ సీక్వెల్ వచ్చే ఏడాది సమ్మర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అప్పటి లోపు సుజీత్ నాని తో కమిట్ అయిన సినిమాని పూర్తి చేస్తాడట. ఈ సినిమా డిసెంబర్ నుండి మొదలు కానుంది. రీసెంట్ గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఓజీ కి సీక్వెల్ ఉంది, అదే విధంగా ప్రీక్వెల్ కూడా ఉంది అని డైరెక్టర్ సుజీత్ చెప్పుకొచ్చాడు. ఈ రెండు సినిమాలకు బల్క్ గా డేట్స్ ఇస్తే ఒకే సమయం లో షూటింగ్ చేస్తాడట. పవన్ కళ్యాణ్ ని ఈ రెండు చిత్రాలు పూర్తి చేసేందుకు 150 రోజుల డేట్స్ అడిగినట్టు సమాచారం. మరి అన్ని రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, బాధ్యతలను సమర్థవతంగా నిర్వహిస్తూ, ఈ సినిమాలను ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.