https://oktelugu.com/

వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ పై మెగా ఫ్యామిలీ స్పందన !

వైష్ణవ్ తేజ్.. ఉప్పెన బ్లాక్ బస్టర్ తో కుర్రాడిలో మ్యాటర్ ఉందని నిరూపించుకున్నాడు. పైగా ఆ సినిమాకి 80 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి మనోడికి స్టార్ డమ్ వచ్చేసింది అనేది మెగా అభిమానుల అభిప్రాయం. అయితే, ఉప్పెన హిట్ తనకు దక్కిన అదృష్టం తప్ప, తన ప్రతిభ కాదు అని వైష్ణవ్ తేజ్ ఆ మధ్య చెప్పుకొచ్చాడు. కానీ, తన ప్రతిభను పరిపూర్ణంగా చూపిస్తున్న సినిమా ఒకటి ఉందని, అదే దర్శక-నిర్మాత క్రిష్ దర్శకత్వంలో వస్తోందని, […]

Written By:
  • admin
  • , Updated On : July 25, 2021 / 12:49 PM IST
    Follow us on

    వైష్ణవ్ తేజ్.. ఉప్పెన బ్లాక్ బస్టర్ తో కుర్రాడిలో మ్యాటర్ ఉందని నిరూపించుకున్నాడు. పైగా ఆ సినిమాకి 80 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి మనోడికి స్టార్ డమ్ వచ్చేసింది అనేది మెగా అభిమానుల అభిప్రాయం. అయితే, ఉప్పెన హిట్ తనకు దక్కిన అదృష్టం తప్ప, తన ప్రతిభ కాదు అని వైష్ణవ్ తేజ్ ఆ మధ్య చెప్పుకొచ్చాడు.

    కానీ, తన ప్రతిభను పరిపూర్ణంగా చూపిస్తున్న సినిమా ఒకటి ఉందని, అదే దర్శక-నిర్మాత క్రిష్ దర్శకత్వంలో వస్తోందని, ఈ సినిమాలో తానేంటో చూపిస్తాను అంటూ వైష్ణవ్ తేజ్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. పైగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

    అన్నిటికి మించి ఇదొక వైవిధ్యమైన సినిమా. అటవీ ప్రాంతంలో ఈ సినిమా నేపథ్యం సాగనుంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిందని ఈ రోజు ఉదయం మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా ఈ సినిమా ప్రివ్యూ వేసారట. సినిమా చూసిన ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని టాక్.

    ఉప్పెనతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్, ఈ సినిమాతో పెద్ద స్టార్ అవడం ఖాయం అని మెగా ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. అందుకే ఈ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయలేదు. అమెజాన్ ప్రైమ్ నుండి భారీ ఆఫర్ వచ్చినా మేకర్స్ మాత్రం ఓటీటీకి అమ్మలేదు. సినిమా బాగా వచ్చింది కాబట్టి, క్రిష్ తానే ఓన్ రిలీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.