Venkatesh-Trivikram movie: ఇప్పటివరకు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన పాన్ ఇండియాలో ఒక్క సినిమా చేయకపోయిన కూడా తెలుగులో మాత్రం ఆయనకు మంచి మార్కెట్ అయితే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెడతాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకున్నదే కావడం విశేషం…ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చేవే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలందరికి మంచి గుర్తింపును తీసుకురావడానికి ఆయన వాళ్లతో మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు ఒక్క సినిమా రాలేదు. కానీ ఆయన రైటర్ గా పనిచేసినప్పుడు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి గొప్ప సినిమాలకు కథ మాటలు అందించాడు. కాబట్టి అప్పటినుంచే వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ కావడం విశేషం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది. తద్వారా వీళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Read Also: నిఖిల్ కొత్త సినిమా సెట్లో ప్రమాదం… క్షణాల్లో అంత అల్లకల్లోలం.. వైరల్ వీడియో…
ఇక త్రివిక్రమ్ కథను అందించిన నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naku Nachhav), మల్లీశ్వరి(Mallishwari) సినిమాల్లో సునీల్ (Sunil) కీలకపాత్రలో నటించాడు. తన కామెడీతో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే దానిమీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…
ఇందులో సునీల్ ఓ కామెడీ విలన్ గా నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు సునీల్ కామెడీ విలన్ గా నటించలేదు. అయితే కమెడియన్ గా చేశాడు, లేదంటే విలన్ గా చేశాడు. కానీ కామెడీ విలన్ గా మాత్రం ఎప్పుడు నటించలేదు. అందువల్ల త్రివిక్రమ్ అతన్ని కామెడీగా చూపించి సినిమాలో నవ్వులు పూయిస్తూనే తనలోని విలనిజాన్ని బయటికి తీయాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా తన కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా మలచాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తేనే త్రివిక్రమ్ కి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం మార్కెట్ మరింత డౌన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…