‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ? అసలు పవన్ సినిమాల లిస్ట్ ఏమిటి ? లాంటి అంశాల పై పవన్ ఫ్యాన్స్ లోనే రోజురోజుకు అనేక వాదనలు. దాంతో వారిలో ఆందోళన పెరుగుతుంది. ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 26వ చిత్రంగా వచ్చి పవన్ క్రేజ్ ను పెంచింది. కానీ 27వ చిత్రంగా ఏది విడుదల అవుతుంది,
మొన్నటి వరకూ క్రిష్ – పవన్ సినిమా అన్నారు. కానీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్ పై ఉన్నాయి కాబట్టి, ఈ రెండు సినిమాలను కూడా పవన్ 27వ సినిమా అంటూనే సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక వచ్చే నెల నుండి మరో సినిమా మొదలు కావాలి. రానాతో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి కూడా ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి,
ఈ చిత్ర నిర్మాతలు కూడా తమది పవన్ 27వ సినిమా అంటున్నారు. పైగా మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనం కోషియం’ సినిమాకి మాది రీమేక్ కాబట్టి, మా సినిమాని త్వరగా ఫినిష్ చేస్తాం అని, ఎట్టిపరిస్థితుల్లో పవన్ తరువాత సినిమా మాదే అంటూ లీకులు ఇస్తున్నారు ఈ సినిమా మేకర్స్. ఇలా మూడు సినిమాలు ఒకేసారి పోటీ పడితే.. అసలు ఏ సినిమాని ముందుగా ప్రమోట్ చేయాలి అనే విషయంలో పవన్ ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు.
సహజంగా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకి ఫ్యాన్స్ సోషల్ మీడియా పేజీలు క్రియేట్ చేసి, ఆ సినిమా తాలూకు పోస్టర్స్ ను వీడియోలను బాగా వైరల్ చేస్తారు. కాకపోతే ఫ్యాన్స్ కి కన్ ఫ్యూజన్ ఉండటంతో పవన్ సినిమాలకు రావాల్సిన క్రేజ్ రావడం లేదు. మరి ఇప్పటికైనా మేకర్స్ కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ ఇస్తే బాగుంటుంది.