Meenakshi Chowdhury : ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెండు మూడు సూపర్ హిట్ సినిమాలు రాగానే బాలీవుడ్ కి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లిన వారిలో కేవలం ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగిలిన వాళ్ళు అటు హిందీ లో అవకాశాలు కోల్పోయి, ఇటు తెలుగు లో అవకాశాలు రాగా కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణ పూజా హెగ్డే(Pooja Hegde). ఇప్పుడు శ్రీలీల(Sree Leela) కూడా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకొని, టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) కూడా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. రీసెంట్ గానే ఈమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : మీనాక్షి చౌదరి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?
అయితే ఇప్పుడు ఆమెకు వెయ్యి కోట్ల పోర్జెక్టు లో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేసే అవకాశం దక్కిందని తెలుస్తుంది. ‘స్త్రీ 2’, ‘మీమీ’, ‘చావా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ‘మడాక్ ఫిలిమ్స్’ అధినేత దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కి నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ ని ఇచ్చారట. హీరో మరియు ఇతర తారాగణం గురించి తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే మీనాక్షి చౌదరి దశ తిరిగినట్టే. కానీ బాలీవుడ్ లో క్లిక్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు మన ఇండియా అన్ని ఇండస్ట్రీస్ కంటే పెద్దది మన టాలీవుడ్ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ నుండే అత్యధిక వసూళ్లు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు సైతం మన నిర్మాతలు, మన డైరెక్టర్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లడం అనేది తెలివి తక్కువ చర్య అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రెండు మూడు హిట్స్ పడగానే కుదురుగా ఒక ఇండస్ట్రీ లో ఉండగకుండా, ఈ హీరోయిన్స్ కి మధ్యలో ఏమి అవుతుంటాదో, బాలీవుడ్ కి వెళ్లి కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు మాత్రమే భారీ హిట్స్ గా నిలిచాయి. ఆమె కెరీర్ లో అత్యధిక శాతం ఫ్లాప్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టి తో ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్రం చేస్తుంది. వీటితో పాటు పలు క్రేజీ ఆఫర్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
Also Read : అందమే అదరహో అనేలా ఫోటోలను పోస్ట్ చేసిన మీనాక్షి