సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంది మీనాక్షి చౌదరి.
ఈ దెబ్బతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హవా నడుస్తుందనే చెప్పాలి.
తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుని పోతుంది మీనాక్షి.
ఇక గత సంవత్సరం ది గోట్ సినిమాతో ఎంతో మందిని మెప్పించింది.
ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో మరింత ఫేమ్ ను సంపాదించింది కూడా.
లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ.
సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా సత్తా చాటుతోంది.
ఈ సినిమాలో తన నటనతో సత్తా చాటుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.