Homeఆంధ్రప్రదేశ్‌Avanti Srinivasa Rao : పదేళ్లలో నాలుగు పార్టీలు.. ఇప్పుడు ఐదో పార్టీలోకి.. ఆ నేత...

Avanti Srinivasa Rao : పదేళ్లలో నాలుగు పార్టీలు.. ఇప్పుడు ఐదో పార్టీలోకి.. ఆ నేత ఎవరంటే?

Avanti Srinivasa Rao : ఏపీ రాజకీయాల్లో అదృష్టవంతులైన నేతలు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో అవంతి శ్రీనివాసరావు ఒకరు. గంటా శ్రీనివాసరావు శిష్యుడుగా పేరు పొందిన ఈయన ఆయనను అనుసరించారు.అధికార పార్టీకి దగ్గరగా ఇట్టే చేరువవుతూ వచ్చారు.ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది.అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.అవంతి విద్యాసంస్థల అధినేతగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన సుపరిచితం.ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈయన..ఎమ్మెల్యేగా,ఎంపీగా,మంత్రిగా వ్యవహరించారు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 2009 నుంచి 2024 వరకు ప్రజాప్రతినిధిగా కొనసాగారు.ఇప్పుడు చేతిలో పదవి లేకపోయేసరికి..అధికార పార్టీని వెతుక్కుంటూ వెళ్తున్నారు.

* పిఆర్పి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు.ఆ ఎన్నికల్లో 18 సీట్లకు పరిమితమైంది పిఆర్పి.అయితే విశాఖ జిల్లా నుంచి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ప్రజారాజ్యం. ఆ పార్టీ తరపున భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు గెలిచారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పిఆర్పీని విలీనం చేశారు చిరంజీవి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అవంతి. 2014లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీ అయ్యారు. కానీ మంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఎంపీగా ఉంటూనే వైసీపీకి టచ్ లోకి వెళ్లారు అవంతి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అవంతి శ్రీనివాసరావు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండున్నర సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

* తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పావులు
పది సంవత్సరాల కాలంలో నాలుగు పార్టీలను మార్చారు అవంతి శ్రీనివాసరావు.తొలుత ప్రజారాజ్యం, తరువాత కాంగ్రెస్, మళ్లీ టిడిపి, అక్కడ నుంచి వైసిపి.. ఇలా పార్టీల మీద పార్టీలు మార్చిన ఆయన ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో టిడిపి వైపు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గం లో విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయన అధికార పార్టీలో చేరడానికి అదో కారణంగా తెలుస్తోంది. తొలుత గంటా శ్రీనివాసరావు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. అందుకే టిడిపిలో ఉన్న పాత పరిచయాలను వినియోగించుకొని అవంతి శ్రీనివాస్ రావు సైకిల్ ఎక్కుతారని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version