Retro Movie : తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడం లో ఘోరంగా విఫలమైన సంగతి మన అందరికీ తెలిసిందే. అసలే గత ఏడాది సూర్య ‘కంగువా’ చిత్రంతో కంగుతిన్నాడు, ఈ ఏడాది ఈ చిత్రం ఇచ్చిన షాక్ ‘కంగువా’ కంటే కాస్త తక్కువే అయినప్పటికీ నష్టాలు మాత్రం భారీగానే వచ్చాయి. సూర్య అభిమానులకు డిజాస్టర్ సినిమాతో కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు మా హీరో అని చెప్పుకోవడానికి ఈ రెండు సినిమాలు బాగానే అనిపిస్తాయి. కానీ సూర్య కంటే ఇండస్ట్రీ కి ఆలస్యంగా వచ్చిన కుర్ర హీరోలు భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని మార్కెట్ పరంగా ఎక్కడికో వెళ్లిపోతున్నారు. కానీ సూర్య మాత్రం ఫ్లాప్స్ తో కాలక్షేపం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ టీం నుండి ఒక పోస్టర్ విడుదలై పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది.
Also Read : ‘భైరవం’ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ కార్యకర్తల డిమాండ్..కారణం ఏమిటంటే!
ఈ చిత్రానికి 235 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్ ని విడుదల చేశారు, కానీ ఆ పోస్టర్ ని బాగా పరిశీలిస్తే చివర్లో థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ అని ఉంటుంది. దీనిని చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఇలా కూడా ఒక సినిమాకు పబ్లిసిటీ చేసుకుంటారా, ఇదే పైత్యం బాబోయ్ అంటూ సూర్య ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రన్ అన్ని ప్రాంతాల్లో ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. తమిళ నాడు ఈ చిత్రానికి 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది డిజాస్టర్ కలెక్షన్స్ అయినప్పటికీ సూర్య కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పక తప్పదు.
అదే విధంగా కర్ణాటక లో 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు సూర్య కి కంచు కోటలు వంటివి. అలాంటి చోటనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే ఏ రేంజ్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా కేరళలో 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఓవర్సీస్ లో 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 101 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా 30 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
One attachment
• Scanned by Gmail