https://oktelugu.com/

Maharashtra Election Results: మహా’ వ్యూహాలు.. ఫలితాలకు ముందే కీలక పరిణామాలు.. ఆసక్తి రేపుతున్న రాజకీయాలు!

మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల ఉత్కంఠ వీడనుంది. మహారాష్ట్ర ఫలితాలే అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. మరాఠా పీఠం ఎవరిదో అన్న ఆసక్తి నెలకొంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 23, 2024 / 10:27 AM IST

    Maharashtra Election Results

    Follow us on

    Maharashtra Election Results: దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యాణ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది. పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఎంపీ సీట్లు సాధించలేకపోయినా.. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నిల్లో ఈ రాష్ట్రాల్లోనూ బీజేపీ 2019తో పోలిస్తే సీట్లు కోల్పోయింది. ఈ పరిణామాల మధ్య జరిగి అసెంబ్లీ ఎన్నికలోల విజయం ఎవరిదో అన్న ఆసక్తి నెలకొంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. మహారాష్ట్ర ఫలితాలే అందరినీ టెన్షన్‌ పెడుతున్నాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఫలితాలకు కొన్ని గంటల ముందు మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ముంబైని గెలిచేవారు మహారాష్ట్రలో అధికారంలోకి వస్తారు. ఈసారి ముంబైలో బీజేపీ, శివసేన మధ్య పోరు నెలకొంది. పోలింగ్‌ తర్వాత వచ్చిన ఫలితాలు మరింత ఆసక్తి చేపుతున్నాయి.

    హంగ్‌ వస్తే రాష్ట్రపతి పాలన..
    మహారాష్ట్ర ఫలితాలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్నాయి. ఈసారి రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఫలితాల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో రాష్ట్రపతి పాలన వి«ధించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రెండ కూటములు ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. దీంతో ఇరు కూటముల్లో చీలకి భయం కూడా నెలకొంది. రెండు కూటముల్లో మూడు పార్టీల చొప్పున ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా పార్టీ ఒక కూటమి నుంచి మరో కూటమిలోకి జంప్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

    ఆ రెండు పార్టీలపైనే అనుమానం..
    మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే సారథ్యంలోని శివసేన కాంగ్రెస్, ఎన్‌సీపీ కలిసి మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్‌ నేతృత్వంలోని పార్టీ బీజేపీ కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఉంది. ఈ పార్టీ కూడా మహాయుతి కూటమికి మెజారిటీ సీట్లు రానిపక్షంలో మహా వికాస్‌ అఘాడీ కూటమిలోకి జంప్‌ అవుతుందని ప్రచారం జరగుతోంది. ఈమేరకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం.

    48 గంటలే గడువ..
    ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీంతో మరింత ఉత్కంఠ నెలకొంది. అందుకే నేతలు ఇప్పటి నుంచే పావులు కదువుపుతున్నారు. ఫలితాలకు ఒక రోజు ముందే ఇరు కూటముల నేతలు మహా డ్రామాకు తెరలేపారు. రిసార్ట్‌ రాజకీయాలు నెరుపుతున్నారు. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా మహా వికాస్‌ అఘాడీ చర్యలు చేపడుతోంది. మరోవైపు మహాయుతి కూడా కూటమిలో చీలిక రాకుండా చూసుకుంటోంది. గెలిచిన ఎమ్మెల్యేలను కర్ణాటక లేదా తెలంగాణకు పంపాలని మహా వికాస్‌ అఘాడీ నేతలు భావిస్తున్నారు.

    కౌన్‌ బనేగా సీఎం..?
    ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు మహాయుతికి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథయంలో మహాయుతి గెలిస్తే ఎవరు సీఎం అవుతారన్న చర్చ కూడా కూటమిలో జరుగుతోంది. ప్రస్తుత సీఎం శివసేన నుంచి రేసులో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా సీఎం పీఠంపై కన్నేశారు. తాను కూడా సీఎంరేసులో ఉన్నానంటున్నారు అజిత్‌ పవార్‌. మరి విజయం ఎవరిది.. సీఎం ఎవరు అవుతారు అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.