Mazaka Movie Collections : సందీప్ కిషన్(sundeep kishan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Mazaka Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు మూవీ టీం ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ సాధారణమైనవి కాదు. కచ్చితంగా సూపర్ హిట్ కొట్టేస్తారేమో అనే రేంజ్ ఫీలింగ్ ని తెచ్చిపెట్టింది. అందుకే మార్కెట్ లో మంచి బజ్ ని ఈ సినిమా క్రియేట్ చేయగలిగింది. కానీ టాక్ సరిగా లేకపోవడంతో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రావడం లేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇక రెండవ రోజు అయితే 50 శాతం డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి థియేట్రికల్ రన్ రావడం అసాధ్యం అని అనుకున్నారు.
Also Read : మజాకా మూవీ ట్విట్టర్ రివ్యూ: సందీప్ కిషన్ మూవీ హిట్టా? ఫట్టా? ప్రేక్షకులు తేల్చేశారు!
కానీ మూడవ రోజు కాస్త పుంజుకుంది. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం మూడవ రోజు ఈ చిత్రానికి 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, నాల్గవ రోజు 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు తర్వాత అత్యధిక వసూళ్లు నాల్గవ రోజునే వచ్చింది. అంతే కాకుండా రెండవ రోజు నుండి వసూళ్లు క్రమేణా పెరగడం చూస్తుంటే, ఈ చిత్రానికి నెమ్మదిగా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మొదలు పెట్టారేమో అని అనిపిస్తుంది. నాల్గవ రోజు కంటే ఐదవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా నాలుగు రోజులకు తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా 3 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయలకు పైగా జరిగింది.
అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే కచ్చితంగా 7 కోట్ల 32 లక్షల రూపాయలకు రాబట్టాలి. నైజాం లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల 20 లక్షలకు జరిగితే నాలుగు రోజులకు కోటి 24 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. అదే విధంగా సీడెడ్ లో కోటి 80 లక్షలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు 51 లక్షల రూపాయిల షేర్ వచ్చింది. ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ విడుదలకు ముందు 4 కోట్ల రూపాయలకు జరిగితే, ఇప్పటి వరకు కేవలం కోటి 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే లాంగ్ రన్ చాలా కావాలి. మరి ఆ రేంజ్ లాంగ్ రన్ వస్తుందా లేదా అనేది రేపు వచ్చే వసూళ్లను బట్టి తెలుస్తుంది.
Also Read : నాలుగేళ్లు ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన విషయం వాస్తవమే అంటూ నిజం ఒప్పుకున్న సందీప్ కిషన్!