Bobby Deol
Bobby Deol : ఇండియన్ సినిమా లో పాత్ బ్రేకింగ్ గా నిల్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘యానిమల్'(Animal Movie) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత బోల్డ్ గా తన మనసులో ఉన్న ఆలోచనలను చూపించడం సందీప్ వంగ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అంటూ ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రశంసల వర్షం కురిసింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో కూడా అదే తరహా సంచలనం సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం దాదాపుగా ఒక సంవత్సరం పాటు టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. దీనిని బట్టి ఈ చిత్రాన్ని మన యూత్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఓటీటీ లో నెటిజెన్స్ వీకెండ్స్ అయితే అధికంగా చూస్తూ ఉంటారు.
Also Read : యానిమల్’ తర్వాత బాబీ డియోల్ ఈ రేంజ్ లో సంపాదించాడా..? ఒకప్పుడు భార్య సంపాదనతో బ్రతికేవాడు!
ఈ చిత్రం ద్వారా హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కి ఎంత మంచి క్రేజ్ వచ్చిందో, విలన్ గా చేసిన బాబీ డియోల్ కి కూడా అలాంటి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర డియోల్ కొడుకుగా , మాస్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ సోదరుడిగా ఇండస్ట్రీ లోకి బాబీ డియోల్ హీరోగా అప్పట్లో భారీ అంచనాల నడుమ వెండితెర అరంగేట్రం చేసాడు. కెరీర్ లో ఈయన పలు సూపర్ హిట్స్ ని కూడా అందుకున్నాడు. కానీ మధ్యలో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. హీరో గా మార్కెట్ పూర్తిగా పోయింది. కనీసం క్యారక్టర్ రోల్స్ కి కూడా బాబీ డియోల్(Bobby Deol) ని ఎవ్వరూ తీసుకోవడం లేదు. సంపాదన లేక దశాబ్ద కాలం నుండి ఇంట్లో ఎన్నో అవమానాలు ఎదురుకుంటున్న సమయంలో బాబీ డియోల్ కి ‘యానిమల్’ చిత్రం ఆఫర్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇప్పుడు బాబీ డియోల్ లేనిదే ఏ స్టార్ హీరో సినిమా లేదు అనేంతలా మారిపోయింది పరిస్థితి. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ కి ముందు, మన టాలీవుడ్ సీనియర్ హీరో తో ఆ క్యారక్టర్ ని చేయించాలని అనుకున్నాడట. ఆ హీరో మరెవెరో కాదు, జగపతి బాబు(Jagapathi Babu). రణబీర్ కపూర్ ని హీరో గా పెట్టి, అత్యధిక శాతం తెలుగు వాళ్ళతోనే ఈ సినిమాని చేయాలని అనుకున్నాడట సందీప్ వంగ. కానీ ఎందుకో చివరి నిమిషం లో సందీప్ కి ఎందుకో జగపతి బాబు ఈ క్యారక్టర్ కి సూట్ కాడు అని అనిపించిందట. క్లైమాక్స్ లో హీరోతో సరిసమానంగా ఫైట్ చేసే ఫిజిక్ జగపతి బాబు లో కనిపించలేదంట. ఇక ఆ తర్వాత ఆయన బాబీ డియోల్ ని సంప్రదించడం, వెంటనే ఆయన ఓకే చెప్పి నటించడం జరిగింది.
Also Read : ఒక్క ఫొటో జీవితాన్నే మార్చేసింది.. బాబీ డియోల్ కష్టాలు తీర్చి స్టార్ ను చేేసింది…