Allu Arjun , Atlee
Allu Arjun and Atlee : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మాత్రం కొంతమంది సూపర్ సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు వెనుకబడి పోతున్నారు. ఒక్కో సినిమాతో తమలోని ఒక స్టైల్ ను ప్రజెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు అందరూ ఈరోజు నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram), అట్లీ (Atlee) డైరెక్షన్ లో సినిమాలను చేస్తున్నాడు. వీరిద్దరితో ఏకకాలంలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ అట్లీతో చేయబోయే సినిమా విషయంలో ఇప్పుడు పలు జాగ్రత్తలైతే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఒకప్పుడు రజినీకాంత్ చేసిన సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా రాబోతుందనే కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనే విషయం అయితే బయటికి చెప్పడం లేదు కానీ రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాల్లో ఒక సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నమైతే చేస్తున్నారట.
Also Read : రిస్క్ చేసిన అల్లు అర్జున్..అట్లీ సినిమాకి అనిరుద్ ని కాదని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం..అతను ఎవరంటే!
అయితే ఈ కథలో ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధిస్తు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీ భారీ విజయాన్ని సాధించి వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాలతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమాతో ఎలాంటి రికార్డులు అయితే కొల్లగొట్టాడో ఇప్పుడు రాబోయే రెండు సినిమాలతో కూడా అలాంటి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తాడా లేదంటే ఈ మూవీస్ తో ప్లాప్ లను మూట గట్టుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆయన సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ విపరీతంగా వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…