Homeఎంటర్టైన్మెంట్Matka Trailer Review : మట్కా ట్రైలర్ రివ్యూ: గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్...

Matka Trailer Review : మట్కా ట్రైలర్ రివ్యూ: గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్ బీభత్సం, ఆడియన్స్ కి గూస్ బంప్స్

Matka Trailer Review : ప్రయోగాలు చేయడంతో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడు. ఆయన హీరోగా నటించిన కంచె, అంతరిక్షం ఈ కోవకు చెందిన చిత్రాలే. అయితే ఆయనకు విజయాలు దక్కడం లేదు. ఎఫ్ 2 అనంతరం వరుణ్ తేజ్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. వరుణ్ తేజ్ గత రెండు చిత్రాలు గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్స్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.

ఈ క్రమంలో ఆయన పీరియాడిక్ క్రైమ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఎంచుకున్నారు. కెజిఎఫ్ సక్సెస్ నేపథ్యంలో ఈ తరహా కథలతో అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి. మట్కా సైతం అలాంటి చిత్రమే. మట్కా చిత్రానికి కరుణ కుమార్ దర్శకుడు. వరుణ్ తేజ్ కి జంటగా మీనాక్షి చౌదరి నటించింది. నోరా ఫతేహి ఓ కీలక రోల్ చేసింది. ,అజయ్ ఘోష్, నవీన్ చంద్ర ఇతర పాత్రలు చేశారు. మట్కా మూవీ నవంబర్ 14న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.

మట్కా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ యాక్షన్, ఎమోషన్ అంశాలతో కూడి ఉంది. ఒక సాధారణ కూలి గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు అనేదే కథ. వరుణ్ తేజ్ లుక్, క్యారెక్టరైజేషన్ ఆకట్టుకున్నాయి. ఆయన భిన్నమైన గెటప్స్ లో కనిపించాడు. క్రైమ్ వరల్డ్, పీరియాడిక్ సెటప్ బాగుంది. సంగీతం జీవి ప్రకాష్ అందించారు. బీజీఎం ఆకట్టుకుంది.

అయితే మట్కా ట్రైలర్ గమనిస్తే కొన్ని హిట్ చిత్రాల స్పూర్తితో తెరకెక్కించాడు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన కెజిఎఫ్, పుష్ప ఈ తరహా కథలే. ఒక సామాన్యుడు క్రైమ్ వరల్డ్ కి డాన్ ఎలా అయ్యాడు అనేది మెయిన్ ప్లాట్. మట్కా సైతం అదే ప్లాట్ కలిగి ఉంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. మూవీ ఈ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

రజని తల్లూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి మట్కా చిత్రాన్ని నిర్మించారు. మట్కా పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. వరుణ్ తేజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Matka Trailer | Varun Tej | Karuna Kumar | Meenakshi Choudhary | Nora Fatehi | GV Prakash Kumar

Exit mobile version