Mass Jathara Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోగా మారిన వాళ్లలో రవితేజ (Raviteja) ఒకరు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి ఘన కీర్తినైతే సంపాదించుకున్నాడో అలాగే స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి ఎవరి సపోర్టు లేకుండా ఎదిగిన అతి తక్కువ మంది హీరోల్లో రవితేజ కూడా ఒకరు. ఆయన కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేశాడు. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో భారీ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘భాను భోగవరపు’ అనే రైటర్ ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.ఇక ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మంచి సినిమాగా నిలువబోతోంది అంటూ గతంలో ఈ దర్శకుడు ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. అయితే ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే రవితేజ ఎప్పుడు ఒకే టెంప్లేట్ లో సినిమాలు చేస్తూ వెళ్తాడు అనే విషయం మనందరికి తెలుసు…ప్రస్తుతం ఈ సినిమా కూడా అదే టెంప్లేట్లో రన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రవితేజ చేసిన సినిమాలన్నీ రొటీన్ రొట్ట ఫార్ములా లో ఉండడమే కాకుండా అవి ఏమాత్రం సక్సెస్ లను సాధించడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేయకుండా మరోసారి రొటీన్ సినిమాలను నమ్ముకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేదే ఇప్పుడు అతని అభిమానుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది…ఇక ఈ సినిమా టీజర్ ని కనక మనం చూసినట్లయితే ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన క్రాక్ సినిమాలోని సేమ్ టెంప్లేట్ తోనే ఈ సినిమా కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ‘పరదా’ మూవీ ట్రైలర్ లో ఆ ఒక్కటి తగ్గిందా..?
అదే మేనరిజం అదే యాక్షన్ అదే యాక్టివిటీ అదే క్యారెక్టర్ తో రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి పెద్దగా తేడా అయితే ఏమి కనిపించలేదు. టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో రవితేజ మరోసారి యాక్షన్ ఎపిసోడ్స్ ని నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. కథలో దమ్ముంటే సినిమా ఆటోమేటిగ్గా ఆడుతోంది.
అలా కాదని ఇష్టం వచ్చినట్టుగా కథను రాసి అందులో నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒక రెండు మాస్ సాంగ్స్ ను పెట్టినంత మాత్రాన సినిమాలైతే ఆడవు మరి రవితేజ ఈ విషయాన్ని తెలుసుకొని చాలా తొందరగా కమర్షియల్ సినిమాలనే కాకుండా డిఫరెంట్ గా సినిమాలను ప్లాన్ చేసుకుంటు మంచి సబ్జెక్టులను సినిమాలుగా చేస్తే బాగుంటుందని అతని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
Also Read: ఏపీ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. ఇంతకీ ఏం జరిగింది..
మరి ఈ సినిమాలో పెద్దగా గొప్ప మేటర్ అయితే ఏమీ లేదు అదే కమర్షియల్ వే లోనే ఈ సినిమాను రవితేజ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. టీజర్ లో చూపించిన ఎలిమెంట్స్ బాగున్నప్పటికి అవి కథలోని ఫ్లో ను చెడగొట్టకుండా ఉంటే సినిమా కమర్షియల్ గా ఆడుతోంది. లేకపోతే మాత్రం ఈ సినిమా భారీ లాస్ లను తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నాయి…