Prakash Raj vs Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. హిందీని(Hindi) రాజభాష అన్న పవన్ కళ్యాణ్.. దాన్ని ఆదరిస్తే తప్పేంటని అన్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్దిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ కి ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
Also Read: అమరావతి విషయంలో చంద్రబాబుకు పవన్ గట్టి షాక్
గచ్చిబౌలి స్టేడియం వేదికగా ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళం’ జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో తెలుగు భాష తల్లి అయితే… హిందీ పెద్దమ్మ వంటిది. మాతృభాష ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికే, బయటకు వెళితే హిందీ భాష కావాలి అన్నారు. తెలుగు చిత్రాలు హిందీలో ఆదరించబడుతున్నాయి. అలాంటప్పుడు హిందీని మనం ఆదరిస్తే తప్పేంటి.. అని చెప్పుకొచ్చారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు హిందీని నిర్బంధం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.
పవన్ కళ్యాణ్ హిందీ భాషను సమర్ధిస్తూ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బీజేపీ పార్టీకి పూర్తి అనుకూలంగా మారిన పవన్ కళ్యాణ్.. వారిచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారని, గతంలో ఈయనే గో బ్యాక్ హిందీ అనే నినాదం చేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. హిందీ నేర్చుకోవడం వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. నార్త్ ఇండియాలో సౌత్ విద్యార్థులు, ఉద్యోగులు హిందీ రాక పడే బాధలు తెలిస్తే ఇలా మాట్లాడరు.. అంటూ పవన్ కళ్యాణ్ కి కొందరు మద్దతు ప్రకటిస్తున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి సంబంధించిన వీడియో షేర్ చేసిన ప్రకాష్ రాజ్… ‘మరీ ఈ రేంజ్ కి అమ్ముకోవడమా.. ఛీ ఛీ’ అని కామెంట్ పోస్ట్ చేశాడు. బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ తొత్తుగా మారాడనే అర్థంలో ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read: తిరుమల వెళ్లి చిచ్చు పెట్టిన బండి సంజయ్
గతంలో కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను ప్రకాష్ రాజ్ వ్యతిరేకించారు. బీజేపీ విధానాలతో పూర్తిగా విభేదించే ప్రకాష్ రాజ్.. ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని గతంలో ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఇక తిరుమల లడ్డు వివాదంలో సైతం పవన్ కళ్యాణ్-ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025