Mass Jatara worldwide collections: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara Movie) రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. కానీ రవితేజ కి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ప్రీమియర్ షోస్ మరియు మొదటి రోజు వసూళ్ల వరకు కాస్త డీసెంట్ రేంజ్ వసూళ్లను నమోదు చేసుకుంది కానీ, రెండవ రోజు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 30 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద ఫ్లాప్ అనేది. మొదటి రోజు 60 వేల టికెట్స్ అమ్ముడుపోతే, రెండవ రోజు సగానికి పైగా పడిపోయింది. ఇది డిజాస్టర్ ట్రెండ్ కి సూచిక. అయితే రెండు రోజుల్లో ప్రాంతాల వారీగా ప్రీమియర్ షోస్ తో కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, మొదటి రోజున 3 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజు కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు ప్రీమియర్ షోస్ తో కలిపి ఈ చిత్రానికి 6 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఆంధ్ర ప్రాంతం నుండి 2 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక గ్రాస్ లెక్కల్లోకి చూస్తే 13 కోట్ల 30 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 20 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే ఈ సినిమా మరో 12 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంటే వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం కచ్చితంగా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు నూన్ షోస్ ట్రెండ్ చూస్తుంటే అది దాదాపుగా అసాధ్యం అనే అనిపిస్తుంది. ఈ చిత్రం రవితేజ గత చిత్రాలతో పోలిస్తే చాలా బెటర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం. మంచి పండగ సీజన్ లో విడుదల చేసుంటే కచ్చితంగా మంచి హిట్ అయ్యేదని అంటున్నారు.