Shah Rukh Khan OG copy: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సినిమాల్లో ఒకటి ఓజీ(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) హీరో గా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు ఎంతటి హైప్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ మొత్తం ఊగిపోయింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని మొదటిరోజు థియేటర్స్ లో మిస్ అవ్వకూడదు అనే కోరిక అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఉండేది. ఫలితంగానే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో #RRR చిత్రం తో సమానంగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ 5 వారాల పాటు థియేటర్స్ లో విజయవంతంగా నడిచింది. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాని ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఓజీ కి సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరో గా నటించిన ‘కింగ్'(King Movie) మూవీ టీజర్ విడుదలైంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ టీజర్ ని చూసి ఇది హిందీ చిత్రం లో ఓజీ తరహా సినిమా అవుతుందేమో అని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఓజీ లో ఎలా అయితే డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్ ని పూర్తిగా ఉపయోగించుకున్నాడో, ఈ కింగ్ చిత్రంలో సిద్దార్థ్ ఆనంద్ కూడా షారుఖ్ ఖాన్ స్టైల్, స్వాగ్ ని ఉపయోగించుకొని సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అంతే కాదు ‘They కాల్ హిమ్ ఓజీ’ లాగా ‘They కాల్ హిమ్ కింగ్’ అనే టైటిల్ తో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పోస్టర్ ఎడిటింగ్స్ చేస్తున్నారు. అంతే కాదు ఓజీ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుకొని కింగ్ మూవీ టీజర్ వీడియో తో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎడిటింగ్ కూడా చేస్తున్నారు.
ఓవరాల్ గా ఓజీ మేనియా నార్త్ ఇండియా వరకు ఎగబాకింది అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసుంటే హిందీ వెర్షన్ లో కూడా ఓజీ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇంత పెద్ద యాక్షన్ సినిమాని నిర్మించి, హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ ని నెట్ ఫ్లిక్స్ డబ్బుల కోసం వదిలేసుకున్నందుకు అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్లీ ఇలాంటి ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు పడుతుందో, మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే అని బాధపడుతున్నారు.
Sau deshon mein badnaam,
Duniya ne diya sirf ek hi naam – #KING#KingTitleReveal
It’s Showtime!
In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025