Homeఎంటర్టైన్మెంట్Maruthi Happy Pongal Movie Update: 40 రోజుల్లో 'హ్యాపీ పొంగల్' మూవీ పూర్తి చేయనున్న...

Maruthi Happy Pongal Movie Update: 40 రోజుల్లో ‘హ్యాపీ పొంగల్’ మూవీ పూర్తి చేయనున్న డైరెక్టర్ మారుతీ.. హీరో ఎవరంటే..

Maruthi Happy Pongal Movie Update: ఒకప్పుడు మారుతీ అంటే మినిమం గ్యారంటీ డైరెక్టర్. ఫ్లాపులు తక్కువ , హిట్లు ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ జానర్ లో అద్భుతంగా ప్రేక్షకులను అలరించే కెపాసిటీ ఈయన సొంతం. కానీ ‘ప్రతి రోజు పండగే’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎందుకో ఈ డైరెక్టర్ కి కాలం అసలు కలిసి రావడం లేదు. ఆ చిత్రం తర్వాత ఈయన చేసిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయినప్పటికీ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ పిలిచి మరీ ‘రాజా సాబ్’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. మారుతీ లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ హిట్స్ లో ఉంటేనే స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టం , అలాంటిది ఫ్లాప్ తర్వాత కూడా ఇచ్చాడంటే ఎంత జాగ్రత్తగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి?, కానీ మారుతీ అది చెయ్యలేదు.

ఎదో కొత్తగా ప్రయత్నిద్దాం అనే తపన తో , అసలు ఏమి తీస్తున్నాడా తనకే అర్థం కాకుండా, ఎలా పడితే అలా గజిబిజిగా ‘రాజా సాబ్’ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఫలితం మన అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైనప్పటికీ కమర్షియల్ గా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. అంతే కాదు మారుతీ పై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. బడ్జెట్ పేరుతో చాలా వరకు నిర్మాత నుండి డబ్బులు నొక్కేసారనే ఒక రూమర్ ఇండస్ట్రీ లో సాగుతోంది. ఇలా ఘోరమైన బ్యాడ్ ఫేస్ ని ఎదురుకుంటున్న మారుతీ, ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో పని చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘హ్యాపీ పొంగల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఎలాంటి హంగులు , ఆర్భాటాలు లేకుండా , చాలా సింపుల్ గా ఈ చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడట.

ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తాడని మొదట్లో ప్రచారం జరిగింది కానీ , ఇప్పుడు ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో హీరో గా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. ‘ఉప్పెన’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ , ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘కొండపోలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆది కేశవ’ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదల అయ్యాయో, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయాయో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇప్పుడు ఆయనకు కూడా హిట్ చాలా అవస . చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version