BB Jodi 2 Title Winner: ‘బిగ్ బాస్ 9’ ముగిసిన తర్వాత స్టార్ మా ఛానల్ లో ఎంతో గ్రాండ్ గా మొదలైన షో ‘BB జోడీ 2’. బిగ్ బాస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చి , జోడీలుగా ఏర్పాటు చేసి నిర్వహించిన ఈ డ్యాన్స్ రియాలిటీ షో నేటి తో ముగియనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ గ్రాండ్ ఫినాలే ని రెండు లెవెల్స్ లో నిర్వహించారు. మొదటి లెవెల్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ నుండి కేవలం టాప్ 4 కంటెస్టెంట్స్ మాత్రమే రెండవ లెవెల్ కి క్వాలిఫై అయ్యారు. ధనరాజ్ – భానుశ్రీ జంట నిన్న ఎలిమినేట్ అయ్యింది. మొదటి లెవెల్ లో అమర్ దీప్ – నైనికా, మానస్ – శ్రేష్టి వర్మ జంటలకు సరిసమానమైన ఓట్లు వచ్చాయి. ఇద్దరు కూడా మొదటి స్థానంలోనే ఉన్నారు.
ఇక రెండవ లెవెల్ నేడు జరగనుంది. ఇందులో మానస్ – శ్రేష్టి వర్మ జంట అత్యధిక పాయింట్స్ ని గెలిచి టైటిల్ విన్నర్స్ గా నిలబడగా, రన్నర్స్ గా విశ్వ – నేహా జంట నిల్చింది. మానస్ – శ్రేష్టి వర్మ టైటిల్ గెలవడం పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్లిద్దరూ అద్భుతంగా డ్యాన్స్ వేశారు. కానీ అమర్ దీప్ – నైనికా జంట కనీసం రన్నర్స్ గా కూడా నిలబడలేకపోయారు. ఇదే అందరినీ నిరాశకు గురి చేస్తున్న విషయం. ప్రోమో ని చూస్తుంటే అమర్ దీప్ డ్యాన్స్ దుమ్ము లేపి దంచి కొట్టేసాడు. అలాంటి వ్యక్తి మూడవ స్థానం లో రావడం ఏంటి?, కచ్చితంగా ఎదో తేడా జరిగింది అని, అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో అత్యధిక సార్లు నెంబర్ 1 స్థానం లో మార్కులు సంపాదించి, గోల్డెన్ సోఫా ని సొంతం చేసుకున్న జంట ఇది.
అలాంటి జంట రన్నర్స్ గా కూడా నిలవకపోవడం ఏంటి?, నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్ – నైనికా జంట తో పోలిస్తే మానస్ – శ్రేష్టి వర్మ జంట డ్యాన్స్ తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇద్దరికీ సమానమైన మార్కులు ఇచ్చారు, ఇదెక్కడి న్యాయం?, కచ్చితంగా వీళ్ళని తొక్కాలి, ఇంకొకరిని పైకి లేపాలి అనే ఉద్దేశ్యంతోనే వీళ్ళు మార్కులు ఇస్తున్నట్టు ఉంది కానీ, న్యాయంగా ఇస్తున్నట్టు అసలు అనిపించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జడ్జీల ఓటింగ్ ద్వారా కాకుండా, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా విజేత ఎవరు అని నిర్ణయించాల్సి వస్తే, కచ్చితంగా అమర్ దీప్ – నైనికా జంట టైటిల్ గెలిచేది అంటున్నారు విశ్లేషకులు.