https://oktelugu.com/

Vishal Marriage: ఆ హీరోయిన్ తో పెళ్లి… ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన విశాల్!

లక్ష్మీ మీనన్ తో విశాల్ పలనాడు, ఇంద్రుడు వంటి చిత్రాలు చేశారు. ఈ క్రమంలో వారు దగ్గరయ్యాని ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లు చల్లబడి చాలా రోజులవుతుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 11, 2023 / 03:26 PM IST

    Vishal Marriage

    Follow us on

    Vishal Marriage: హీరోయిన్ లక్ష్మీ మీనన్ ని విశాల్ వివాహం చేసుకోబోతున్నాడనే వార్త కుదిపేస్తోంది. రెండు రోజులుగా తమిళ మీడియాలో ప్రముఖంగా ప్రచారం అవుతున్న కథనాలపై విశాల్ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ”నేను ఇలాంటి పుకార్లపై స్పందించను. అనవసరం అని వదిలేస్తాను. ఈసారి మాట్లాడాల్సి వస్తుంది. లక్ష్మీ మీనన్ ని నేను వివాహం చేసుకోబోతున్నాననే వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా అవాస్తవం. లక్ష్మీ మీనన్ హీరోయిన్ కంటే ముందు ఒక అమ్మాయి. నిరాధార కథనాల కారణంగా ఆమె వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఆమె ఇమేజ్ పాడవుతుంది.

    నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను అనేది మీకు అనవసరం. అది కుదిరినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. నా పెళ్లి గురించి చర్చ వదిలేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు అందరినీ చల్లగా చూడాలి” అని ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశాడు. విశాల్ నేరుగా క్లారిటీ ఇవ్వడంతో ఆయన పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది. ఇక గతంలో కూడా వీరిపై ఎఫైర్ రూమర్స్ వినిపించాయి.

    లక్ష్మీ మీనన్ తో విశాల్ పలనాడు, ఇంద్రుడు వంటి చిత్రాలు చేశారు. ఈ క్రమంలో వారు దగ్గరయ్యాని ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లు చల్లబడి చాలా రోజులవుతుంది. సడన్ మళ్ళీ తెరపైకి వచ్చాయి. కాగా విశాల్ గతంలో హీరోయిన్ వరలక్ష్మితో డేటింగ్ చేశారు. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు.

    2019లో విశాల్ హైదరాబాద్ కి చెందిన అనీషా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. గ్రాండ్ గా విశాల్-అనీషా రెడ్డి నిశ్చితార్థ వేడుక జరిగింది. కారణం తెలియదు కానీ ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ విశాల్ పెళ్లి మాటెత్తలేదు. ఇక విశాల్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. చందరంగం, పందెంకోడి, భరణి, వాడు వీడు చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. ఈ మధ్య విశాల్ చిత్రాలు అంతగా ఆడటం లేదు.