
కత్రినా కైఫ్ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. తానూ 40లోకి అడుగు పెట్టకముందే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని. మరి పెళ్ళికి తెగ ఉబలాట పడుతున్న కత్రినాకి కాలం కలిసి వస్తోందా ? కత్రినా ఎవర్నీ పెళ్లి చేసుకున్నా.. ముందు ఆమెకు సల్మాన్ అంగీకారం ముఖ్యమట. అయితే ఇంకా సల్మాన్ నుండి ఆమెకు పెళ్ళికి సంబంధించి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందలేదని టాక్ నడుస్తోంది.
కాకపోతే కత్రినాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఈ ఏడాది మీకు పెళ్లి కావాలని కోరుకుంటున్నాం అంటూ విష్ చెయ్యడం విశేషం. పైగా ఇలాంటి విషెస్ చెప్పిన సెలబ్రిటీలలో ఎక్కువ శాతం మంది సినీ ప్రముఖులే ఉన్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మేనేజర్ కూడా ఇలాంటి విష్ చేయడంతో ఇప్పుడు కత్రినా పెళ్లి హాట్ టాపిక్ అయింది.
ఇంతకీ సల్మాన్ మేనేజర్ ఏమి విష్ చేసాడంటే.. ‘త్వరలోనే మిమల్ని పెళ్లి కూతురు’ గెటప్ లో చూస్తానని అనుకుంటున్నాను’ అంటూ అతగాడు ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చెయ్యడం వెనుక సల్మాన్ ఉన్నాడనే పుకారు వినిపిస్తోంది. సల్మాన్ ఖానే, కత్రినాకి పెళ్ళి ముహూర్తం కూడా ఖరారు చేశాడని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం సల్మాన్ ఖాన్ మేనేజర్ ఇప్పటికీ కత్రిన డేట్లు గట్రా వ్యవహారాలు చూస్తుంటాడు అని, అందుకే అతను విష్ చేసి ఉంటాడని అంటున్నారు.
మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే.. కొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం కత్రినా, యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రేమలో మునిగి తేలుతూ సంతోషంగా ఉంది. కానీ, ఇప్పటికీ ఆమె సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగానే ఉంటుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కూడా అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంది. ఏమిటో కత్రినా.. ఒకపక్క విక్కీతో లవ్ లో ఉండి, అతనితో పెళ్లి ముచ్చట్లు మాట్లాడుతూ.. మళ్ళీ సల్మాన్ తో సీక్రెట్ బంధం ఏమిటో !!