గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త.. అమలులోకి కొత్త రూల్స్..?

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా చాలామంది కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే కొత్త గ్యాస్ సిలిండర్ తీసుకోవాలని భావించే వాళ్లు ఇకపై సులభంగా గ్యాస్ సిలిండర్ ను తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినా గ్యాస్ సిలిండర్ కోసం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ ఉంటే […]

Written By: Navya, Updated On : July 19, 2021 11:03 am
Follow us on

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా చాలామంది కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే కొత్త గ్యాస్ సిలిండర్ తీసుకోవాలని భావించే వాళ్లు ఇకపై సులభంగా గ్యాస్ సిలిండర్ ను తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినా గ్యాస్ సిలిండర్ కోసం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది.

కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ ద్వారా సులువుగా మరో గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగం తెచ్చుకుని లేదా ఇతర కారణాల వల్ల గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఇంట్లోని గ్యాస్ కనెక్షన్ ద్వారా సులభంగా కొత్త గ్యాస్ కనెక్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలామందికి బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫ్యామిలీ గ్యాస్ కనెక్షన్ వివరాలు, అడ్రస్ ప్రూఫ్ అందించడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లకు ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ను తీసుకోవడం వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఐఓసీఎల్ తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా గ్యాస్ కనెక్షన్ ను పొందాలని అనుకునే వాళ్లకు ఊరట కలగనుందని చెప్పాలి.

గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వాళ్లు కొత్త గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని గ్యాస్ డీలర్ ను సంప్రదించి సులభంగా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.