Mark Shankar : ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకొని గాయాలపాలైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ మార్క్ శంకర్ తో పాటు 15 మంది పిల్లలు కేవలం గాయాలతో బయటపడ్డారు, మార్క్ శంకర్ పక్కనే కూర్చున్న అమ్మాయి మాత్రం చనిపోయింది. అయితే ఈ ఘటనలో మార్క్ శంకర్ ఊపిరి తిత్తుల్లోకి నల్ల పొగ వెళ్లడంతో, ఆయనకు బ్రోన్కోస్కోపీ చేయాల్సి వచ్చింది. ఆ చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి కూడా తిరిగి వచ్చేసాడు. కొడుకు ని సురక్షితంగా కాపాడినందుకు మార్ శంకర్ తల్లి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించిన ఘటన నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ వైద్యానికి అయిన ఖర్చు ఇంతేనా..?
ప్రస్తుతం మార్క్ శంకర్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని సీకే ఫంక్షన్ హాల్లో పెగల్గామ్ లో చనిపోయిన వాళ్లకు నివాళి అర్పిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమం లో ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందులో ముఖ్యంగా తన కొడుకు పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. సింగపూర్ లో ఆ ఘటన జరిగిన తర్వాత నా బిడ్డ ఆ ట్రాన్స్ నుండి ఇంకా బయటకు రాలేదని, ఇప్పటికీ వాడు అర్థరాత్రులు అకస్మాత్తుగా నిద్ర లేస్తున్నాడని, వాడికి బిల్డింగ్ పై నుండి పడిపోతున్నట్టు కలలు వస్తున్నాయని, ఈమధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ అయిపోతూ ఉండడంతో దీనిని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్‌తో ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఇదే విధంగా పెహల్గామ్ లో ఉగ్రవాదుల చేతిలో దాడికి గురి చనిపోతుంటే కుటుంబ సభ్యులు నిస్సహాయత స్థితిలో అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు ఎంత భయానకమైన స్థితిలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారో ఊహించుకోలేకపోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి సమయం లో వాళ్లకు అండగా నిల్చి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అదే సభలో ఆయన ఉగ్రదాడుల్లో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించాడు. మధుసూదన్ జనసేన పార్టీ మెంబెర్ కూడా కావడంతో, చనిపోయిన తర్వాత 5 లక్షల రూపాయిల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది కాబట్టి, మొత్తం మీద 55 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని త్వరలో ఆ కుటుంబానికి అందజేస్తామని చెప్పుకొచ్చాడు. కేవలం ఆర్ధిక సాయం మాత్రమే కాకుండా, జీవితంలో వాళ్లకు ఏ చిన్న అవసరం వచ్చినా అండగా ఉంటానని, నా పేషీ నంబర్స్ కూడా వాళ్లకు అందజేశానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
Also Read : మార్క్ శంకర్ కోసం సింగపూర్ కి రేణు దేశాయ్..కానీ చివరికి ఏమైందంటే!