Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి, కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో తప్ప. ఎందుకంటే మేకర్స్ ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్స్ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. నిన్ననే అనుమతిని ఇస్తూ జీవో ని జారీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల కాస్త వాయిదా పడింది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో ని జారీ చేసింది. సింగల్ స్క్రీన్స్ కి 50 రూపాయిలు (అదనంగా జీఎస్టీ), మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కి 75 రూపాయిలు (అదనంగా జీఎస్టీ) పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చింది. అయితే స్పెషల్ షోస్ కి కూడా అనుమతిని కోరగా, అందుకు ప్రభుత్వం నిరాకరించినట్టు తెలుస్తుంది.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
సింగల్ స్క్రీన్స్ 50 రూపాయిలు పెంపు అంటే, 145 రూపాయిలు ఉన్న టికెట్ రేట్ 195 రూపాయిలు అవుతుంది. అదే విధంగా మల్టీ ప్లెక్స్ లో 75 రూపాయిలు పెంపు అంటే 177 రూపాయిలు ఉన్న టికెట్ రేట్ 252 రూపాయలకు వస్తుంది. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాకు ఇది చాలా ఎక్కువ అని అంటున్నారు నెటిజెన్స్. పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవడం లో ఎలాంటి తప్పు లేదు, కానీ 50 కోట్ల రూపాయిల లోపు థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ‘హిట్ 3’ లాంటి సినిమాలకు కూడా అంత టికెట్ రేట్స్ పెట్టడం అవసరమా అని ప్రముఖ విశ్లేషకులు మండిపడుతున్నారు. సుమారుగా వారం రోజుల పాటు ఈ టికెట్ రేట్స్ కొనసాగబోతున్నాయి. ఆ తర్వాత నుండి మామూలు రేంజ్ టికెట్ రేట్స్ అందుబాటులోకి వస్తాయి.
సినిమాకు టాక్ బాగుంటే కచ్చితంగా ఈ టికెట్ రేట్స్ బాగా కలిసి వస్తాయి. ఒకవేళ టాక్ తేడా అయితే మొదటికే మోసం వస్తుంది. వచ్చే కలెక్షన్స్ కూడా రావు. సెన్సార్ రిపోర్ట్స్ ఈ చిత్రానికి చాలా బలంగా ఉన్నాయి. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. హీరో నాని కూడా ఈ చిత్రం విజయం పై భీభత్సమైన నమ్మకం తో ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో లో గంటకు ఆరు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉంది. అదే విధంగా నార్త్ అమెరికా లో అయితే ఈ సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది అనే చెప్పాలి. కేవలం ప్రీమియర్ షోస్ నుండే హాఫ్ మిలియన్ డాలర్స్ గ్రాస్ ని బుకింగ్స్ ద్వారా రాబట్టింది.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?