https://oktelugu.com/

Aadhaar Pan Link: ఆధార్, పాన్ అను సంధానించకపోతే.. అంత పెద్ద ఆర్థిక ఘోరం తప్పదు..

ఆధార్, పాన్ అనుసంధానించాలని దీనికి చాలా సార్లు గడువులు ఇస్తూ వచ్చింది. అయితే రీసెంట్ గా మరోసారి కూడా గడువు ఇచ్చింది. మే 31, 2024 వరకు పాన్ కార్డుతో ఆధార్ అసంధానం చేసుకోవాలని గడువు విధించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 25, 2024 / 02:37 PM IST

    Aadhaar Pan Link

    Follow us on

    Aadhaar Pan Link: ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అన్ని పనులకు కార్డు నెంబర్ ను జోడించాలని చెప్తోంది. అయితే కొన్నింటిని ఆ జాబితా నుంచి తొలగించాలని కొందరు కోర్టుల ద్వారా ఫైట్ చేయగా.. న్యాయ స్థానాలు ప్రతీ ఒక్కదానికి ఆధార్ అవసరం లేదని చెప్పింది. దీన్ని పక్కన పెడితే.. ఆర్థిక పరమైన వ్యవస్థలో మాత్రం ఆధార్ తప్పనిసరి అంటూ సంబంధిత శాఖ చెప్తోంది.

    ఆధార్, పాన్ అనుసంధానించాలని దీనికి చాలా సార్లు గడువులు ఇస్తూ వచ్చింది. అయితే రీసెంట్ గా మరోసారి కూడా గడువు ఇచ్చింది. మే 31, 2024 వరకు పాన్ కార్డుతో ఆధార్ అసంధానం చేసుకోవాలని గడువు విధించింది. లేదంటే TDS డిడక్షన్ పై రెండింతల అయితే చాలా మంది ఎలా చేసుకోవాలో అన్న సందేహం కలుగక మానదు. అందుకు కొన్ని సూచనలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

    ముందుగా incometax.gov.inలోకి వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ కార్డు స్టేటస్ ఎంచుకుంటే రెండు కార్డులు లింకయ్యాయా? లేదా? అనేది తెలుస్తుంది. ఒక వేళ లింక్ కాకుంటే ఇక్కడే లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న లింక్ ఆధార్ క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో ఆధార్ నెంబర్, మరో బాక్స్ లో పాన్ నెంబర్ ఎంటర్ చేయండి.

    అక్కడ కంటిన్యూ విత్ ఈపే ట్యాక్స్ పై క్లిక్ చేస్తే మరో బాక్స్ వస్తుంది. అక్కడ పాన్, నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయాలి. కింద ఉన్న దాంట్లో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తే లింక్ అయిపోతుంది.

    ఇప్పుడు ఈపే టాక్స్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఇన్ కం టాక్స్ ఫైల్ లోకివెళ్లి అసిస్ మెంట్ ఇయర్ ను 2024-25 ను ఎంచుకొని పేమెంట్ టైప్ అదర్ రిసిప్ట్స్ పై క్లిక్ చేసి కంటి న్యూ పై క్లిక్ చేస్తే పేమంట్ పూర్తయి లింక్ జరిగినట్లు ధృవీకరణపత్రం ఇస్తుంది. ఇలా చేస్తే డబుల్ TDS నుంచి తప్పించు కోవచ్చు. లేదంటే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.