https://oktelugu.com/

Sharwanand Marriage: వామ్మో.. శర్వానంద్ పెళ్లి కోసం ఆయన తల్లితండ్రులు తీసుకున్న కట్నం అన్ని కోట్లా!

శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి రక్షిత రెడ్డి తెలంగాణ కి చెందిన అమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. అంతే కాదు ఆమెకి పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది, ఆమె తాతయ్య బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి తెలుగు దేశం పార్టీ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒకప్పుడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 5, 2023 / 03:43 PM IST

    Sharwanand Marriage

    Follow us on

    Sharwanand Marriage: ఇన్నేళ్లు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఒకడిగా కొనసాగిన శర్వానంద్ నిన్నతో తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేసి రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన శర్వానంద్ పెళ్ళికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. ఈ వివాహ మహోత్సవం జైపూర్ లో కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రుల సమక్షం లో అంగరంగ వైభవంగా జరిగింది.

    అయితే ఈ పెళ్ళికి శర్వానంద్ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారిలో తనకి ఎంతో దగ్గరైన కొంతమందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కి చిన్నప్పటి నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ పెళ్ళికి ముఖ్య అతిథిగా విచ్చేసి, కాసేపు శర్వానంద్ కుటుంబం తో గడిపి తిరిగి వెళ్ళాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    ఇక శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి రక్షిత రెడ్డి తెలంగాణ కి చెందిన అమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. అంతే కాదు ఆమెకి పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది, ఆమె తాతయ్య బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి తెలుగు దేశం పార్టీ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒకప్పుడు.

    అయితే శర్వానంద్ కి రక్షిత రెడ్డి తల్లి తండ్రులు భారీ మొత్తం లోనే కట్న కానుకలు ఇచ్చినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. సుమారుగా 20 కోట్ల రూపాయిల నగదు తో పాటుగా, మూడు కేజీల బంగారం కూడా ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుస గుసలు. ఇదే కనుక నిజమైతే అత్యధిక కట్నం తీసుకున్న టాలీవుడ్ హీరో గా శర్వానంద్ చరిత్రలో నిలిచిపోతాడు.