Manu Charitra Review: నటీనటులు : శివ కందుకూరి, సుహాస్, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాత్సవ్,డాలి ధనంజయ్ తదితరులు
డైరెక్టర్ : భరత్
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్
నిర్మాత : నరల శ్రీనివాస రెడ్డి
ఆదిపురుష్ చిత్రం విడుదలైన తర్వాత మన టాలీవుడ్ లో థియేటర్స్ కి వెళ్లి చూడదగ్గ సినిమా ఒక్కటీ ఈ వారం రాలేదు. అయితే ఉన్న సినిమాలలో కాస్త బెటర్ గా అనిపించినా చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘మను చరిత్ర’ అని చెప్పొచ్చు. శివ కందుకూరి హీరో గా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో ఒకసారి చూద్దాము.
కథ :
వరంగల్ లో రుద్ర ( డాలి ధనంజయ్) అనే పెద్ద రౌడీ దగ్గర పని చేస్తూ ఉంటాడు మను (శివ కందుకూరి). అలా తన రౌడీ జీవితం కొనసాగిస్తున్న సమయం లో ఒక అందమైన అమ్మాయి జాను (ప్రగతి శ్రీవాత్సవ్) పరిచయం అవుతుంది. ఆమెతో ఈయన ప్రేమలో పడుతారు, ఇద్దరు ప్రేమించుకుంటారు కూడా.కానీ మను తాను రౌడీ అనే విషయం బయటపెడితే ఎక్కడ ఆ అమ్మాయి దూరం అవుతుందో అని భయపడి ఆ విషయం దాచుతాడు. కానీ ఒకానొక సందర్భం లో ఆ విషయం బయటపడుద్ది. అప్పుడు మను ని జాను మోసగాడు అని నిందించి అతని జీవితం లో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు పాల్ నందు (సుహాస్) అసలు మను ఎందుకు అలా తయారయ్యాడు అనే విషయాన్నీ చెప్పుకొస్తాడు. గతం లో మను మంచి స్టూడెంట్, అతను జెన్నిఫర్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే కొన్ని కారణాల చేత ఆమెతో విడిపోవాల్సి వస్తుంది. అప్పటి నుండి మను దేవదాస్ లాగ మారిపోతాడు, కానీ ఎప్పుడైతే జాను ని చూసాడా అప్పటి నుండి అతని జీవితం మారిపోతుంది, ఆ మార్పు వల్ల అతనికి ఎదురైనా సంఘటనలే సినిమా.
విశ్లేషణ :
ఇలాంటి కథలు టాలీవుడ్ లో మన చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము, చూసి చూసి బాగా బోర్ కొట్టేసింది. కథ ఎలా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటె ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వొచ్చు. కానీ ఈ చిత్రం లో అదే లోపించింది, సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు అయిపోతుంది రా బాబు అని అనిపించేలా చేస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో శివ కందుకూరి రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో మంచిగా స్టైలిష్ గా కనిపిస్తాడు, ఇక ప్రస్తుతం గెడ్డం పెంచుకొని అర్జున్ రెడ్డి స్టైల్ లో ఉంటాడు.కానీ ఆయన నటన ఆకట్టుకోలేకపోయింది. ఇక హీరోయిన్స్ గా నటించిన మేఘ ఆకాష్ మరియు ప్రగతి శ్రీవాత్సవ్ కూడా పవలేదు అనిపించారు. కానీ డైరెక్టర్ భరత్ కి అసలు సినిమాని ఎటు నుండి ఎటు తీసుకెళ్తున్నాడో వెండితెర మీద చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఎవరికీ అర్థం కాదు.మధ్య మధ్యలో సుహాస్ స్పెషల్ రోల్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది.
చివరి మాట : పరంగా బోరింగ్ సినిమా, అంతలా చూడాలి అనుకుంటే ఓటీటీ లో వచ్చినప్పుడు చూడండి.
రేటింగ్: 1.75