Manchu Manoj Second Marriage: మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తాయని కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మనోజ్ రెండో పెళ్లి నిర్ణయమే ఈ గొడవలకు కారణం అనేది టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ క్రమంలో మోహన్ బాబు, విష్ణు… మనోజ్ పై కోపంగా ఉన్నారట. ఇటీవల విష్ణు బర్త్ డే జరుపుకున్నారు. మనోజ్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పే ప్రయత్నం చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. మంచు విష్ణు తమ్ముడు బర్త్ డే విషెస్ ని పట్టించుకోలేదు.

భార్యతో విడాకులు తీసుకున్న మంచు మనోజ్ ఒంటరిగా ఉంటున్నారు. ఆయన భూమా మౌనిక రెడ్డి దగ్గరయ్యారు. కొద్దిరోజులుగా మనోజ్, మౌనిక రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళుతున్నారు. భూమా నాగిరెడ్డి జయంతి నాడు మనోజ్ మౌనికతో పాటు సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు. ఇక వినాయక చవితికి మనోజ్, మౌనిక కలిసి పూజలు చేశారు. మనోజ్-మౌనిక మధ్య రిలేషన్ మొదలైంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది విశ్వసనీయ సమాచారం.
పొలిటికల్ కుటుంబానికి చెందిన మౌనికతో పెళ్లి మంచు కుటుంబానికి ఇష్టం ఇష్టం లేదట. ఈ సంబంధం మనకు వద్దని మనోజ్ ని వారిస్తున్నారట. అయితే మనోజ్ వినడం లేదట. మౌనికను వివాహం చేసుకోవాల్సిందే అంటున్నాడట. ఈ విబేధాల నేపథ్యంలో మనోజ్ ఫ్యామిలీతో కలిసి ఉండటం లేదట. ఆయన కొన్నాళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారట. కాగా మంచు మనోజ్-మౌనికల వివాహ తేదీ నిశ్చయం అయ్యిందట. కొత్త సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారట.

2023 ఫిబ్రవరి 2న మంచు మనోజ్ మౌనిక మెడలో తాళి కట్టనున్నారట. మౌనికతో మనోజ్ పెళ్లి అనివార్యమే అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఘనంగా జరిగింది . 2019లో మనోజ్ విడాకుల ప్రకటన చేశారు. మరోవైపు మనోజ్ కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అయిపోయింది. అహం బ్రహ్మస్మి టైటిల్ తో మనోజ్ ఒక పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు.