Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో మనం ఏం చేయకూడదో సూచించాడు. మంచి, చెడుల గురించి పలు రకాలుగా విశదీకరించాడు. ఏది మంచో ఏది చెడో కూడా సూచించాడు. చంద్రగుప్తుని ఆస్థానంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి అతడి ఉన్నతికి ఉపయోగపడ్డాడు. పురుషులు, స్త్రీలకు వేరువేరుగా నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయని చాణక్య నీతి చెబుతోంది. జీవితంలో మనం ఏ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామనే దానిపై ఎంతో చాకచక్యంగా వ్యవహరించాలని పేర్కొన్నాడు. లేకపోతే జీవితంలో ఇబ్బందులే ఎదురవుతాయని కూడా తెలియజేశాడు. మన జీవితంలో అడుగడుగునా ఎదుర్కొనే కష్టాల నుంచి ఎలా దాటాలో కూడా చాటిచెప్పాడు. మనకు కష్టాలు రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా చెప్పాడు.

పురుషులు తమ వ్యక్తిగత రహస్యాలను ఎవరి ముందు చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సన్నిహితులు, కుటుంబసభ్యులకు కూడా చెప్పొద్దు. వ్యక్తిగత రహస్యాలను ఇతరులకు చెబితే సమస్యలు ఎదురవుతాయి. అందుకే రహస్యాలను మనతోనే ఉంచుకోవాలి. మనకు కలిగే అవమనాలను సైతం ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మనల్ని కించపరచే ఉద్దేశంతో ఉన్న వారికి మనం చెప్పేవి వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఏదైనా సమయంలో మనల్ని చులకనగా చూసేందుకు ఇది అవకాశం ఇస్తుంది. మనకు ఎదురైన అవమానాలను ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమం.
భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అంతమాత్రాన మన కలహాలను ఇతరులతో చెప్పుకోవడం అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు అవి ఎవరితోనూ చెప్పుకోకపోవడమే మేలు. గొడవలు పడే ఆలుమగలను చులకనగా చూస్తారు. అందుకే మన విషయాలు ఎవరితోనూ పంచుకోవడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి. ప్రతి వారికి బలహీనతలు, బలాలు ఉండటం కామనే. కానీ వాటిని ఎవరికి చెప్పుకోకూడదు. ఎవరికైనా చెబితే మనకే హాని కలుగుతుంది.

మన వ్యక్తిగత విషయాలు ఎవరితో చెప్పుకోవడం వల్ల మనకు నష్టాలే వస్తాయి. మన గురించి పూర్తిగా తెలియడం వల్ల మన బలహీనతలు పసిగడతారు. ఫలితంగా వారు మనపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. మనల్ని కించపరచే వ్యాఖ్యలు చేయడం సహజమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రహస్యాలను ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు. మన రహస్యాలను మనతోనే ఉంచుకోవాలి. ఎంత ప్రాణస్నేహితుడైనా సరే మన విషయాలు చెప్పుకుంటే చులకన కావడం జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.